హాఫ్ సెంచరీ తర్వాత ‘సురేందర్’ జెర్సీ చూపించిన నితీశ్ రాణా.. ఎవరీ సురేందర్...

Published : Oct 24, 2020, 05:39 PM IST
హాఫ్ సెంచరీ తర్వాత ‘సురేందర్’ జెర్సీ చూపించిన నితీశ్ రాణా.. ఎవరీ సురేందర్...

సారాంశం

35 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న తర్వాత ‘సురేందర్’ అని రాసి ఉన్న జెర్సీని చూపిస్తూ... సెలబ్రేట్ చేసుకున్న నితీశ్ రాణా...  

IPL 2020 సీజన్‌లో మరోసారి అదరగొట్టే పర్ఫామెన్స్ ఇచ్చాడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్ నితీశ్ రాణా. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న తర్వాత ‘సురేందర్’ అని రాసి ఉన్న జెర్సీని చూపిస్తూ... సెలబ్రేట్ చేసుకున్నాడు నితీశ్ రాణా. అసలు ఎవరీ సురేందర్? అని అర్థం కాక, సతమతమవుతున్నారు ఐపిఎల్ అభిమానులు.

కొంతమంది సురేందర్, నితీశ్ రాణా తండ్రి అని అంటుంటే... మరికొందరు సురేందర్, రాణా కోచ్ అని అభిప్రాయపడ్డారు. అయితే నితీశ్ రాణా మామగారి పేరు ఇది. నితీశ్ రాణా సాచీ మర్వా అనే అమ్మాయిని రెండేళ్లు ప్రేమించి, 2019 ఫిబ్రవరిలో పెళ్లాడాడు.

 

 

సాచీ మర్వా తండ్రి సురేందర్ నిన్న తుది శ్వాస విడిచారు. అయితే ఐపిఎల్ కోసం దుబాయ్‌లో ఉన్న నితీశ్ రాణా అంతిమ యాత్రలో పాల్గొనలేకపోయాడు. దాంతో హాఫ్ సెంచరీ అనంతరం 63 ఏళ్ల ఆయన వయసుకి గుర్తుగా 63 నెంబర్‌తో ‘సురేందర్’ అని రాసి ఉన్న జెర్సీ ఆకాశానికి చూపించి నివాళి అర్పించాడు నితీశ్ రాణా.

PREV
click me!

Recommended Stories

IPL 2026 auction లో కామెరాన్ గ్రీన్ కు రూ.25 కోట్లు.. చేతికి వచ్చేది రూ.18 కోట్లే ! ఎందుకు?
IPL 2026 Auction: కామెరాన్ గ్రీన్‌కు జాక్‌పాట్.. రూ. 25.20 కోట్లు కుమ్మరించిన కేకేఆర్ !