KKRvsDC: చితక్కొట్టిన రాణా, నరైన్... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ భారీ స్కోరు...

Published : Oct 24, 2020, 05:14 PM IST
KKRvsDC: చితక్కొట్టిన రాణా, నరైన్... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ భారీ స్కోరు...

సారాంశం

నాలుగో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం... సునీల్ నరైన్ సూపర్ హాఫ్ సెంచరీ... అద్భుత హాఫ్ సెంచరీ చేసిన నితీశ్ రాణా... ఆఖర్లో ఇయాన్ మోర్గాన్ మెరుపులు...  

IPL 2020: టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ విఫలం కావడంతో ఒకనాక దశలో 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. అయితే ఆ తర్వాత నితీశ్ రాణా, సునీల్ నరైన్ కలిసి బౌండరీల వర్షం కురిపించారు.

నాలుగో వికెట్‌కి 115 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. సునీల్ నరైన్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసి అవుట్ కాగా నితీశ్ రాణా 53 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్స్‌తో 81 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. ఇయాన్ మోర్గాన్ 9 బంతుల్లో 17 పరుగులు చేశాడు.  

గిల్ 9, రాహుల్ త్రిపాఠి 13 పరుగులు చేయగా దినేశ్ కార్తీక్ 3 పరుగులే అవుటై మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సునీల్ నరైన్, మిడిల్ ఆర్డర్‌లో వచ్చి బౌండరీల వర్షం కురిపించాడు. నరైన్ అవుటైన తర్వాత వచ్చిన ఇయాన్ మోర్గాన్ కూడా బౌండరీల మోత మోగించడంతో భారీ స్కోరు చేయగలిగింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది కేకేఆర్.

PREV
click me!

Recommended Stories

ఇది కదా కిర్రాకెక్కించే వార్త.. బెంగళూరులోనే RCB మ్యాచ్‌లు.. ఇక గ్రౌండ్ దద్దరిల్లాల్సిందే
T20 World Cup 2026: ఐసీసీకి అంబానీ జియో హాట్‌స్టార్ షాక్