KKR vs MI: ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ... చిత్తుగా ఓడిన కోల్‌కత్తా...

Published : Sep 23, 2020, 11:40 PM IST
KKR vs MI: ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ... చిత్తుగా ఓడిన కోల్‌కత్తా...

సారాంశం

బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇచ్చిన ముంబై ఇండియన్స్... ఫామ్‌లోకి వచ్చిన జస్ప్రిత్ బుమ్రా... 33 పరుగులు చేసిన ప్యాట్ కమ్మిన్స్, 30 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్... కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై 49 పరుగుల తేడాతో భారీ విజయం...

IPL 2020లో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది ముంబై ఇండియన్స్. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చూపించి ఘన విజయం సాధించింది. కట్టుదిట్టమైన బౌలింగ్, అద్భుతమైన ఫీల్డింగ్‌తో రస్సెల్, మోర్గాన్ వంటి భారీ హిట్టర్లున్న కోల్‌కత్తాకి ఎలాంటి అవకాశం లేకుండా చేసింది ముంబై. శుబ్‌మన్ గిల్ 7, సునీల్ నరైన్ 9 పరుగులు చేసి అవుట్ కాగా దినేశ్ కార్తీక్ 30, నితీశ్ రాణా 24 పరుగులతో కాసేపు పోరాడారు.

ఈ ఇద్దరూ అవుటైన తర్వాత మిగిలిన ఏ బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇయాన్ మోర్గాన్ 16, ఆండ్రూ రస్సెల్ 11 పరుగులతో అవుట్ అయిన తర్వాత ప్యాట్ కమ్మిన్స్ నాలుగు సిక్సర్లు బాది ఆసక్తి రేపాడు. అయితే 11 బంతుల్లో 38 పరుగులు చేసిన ప్యాట్ కమ్మిన్స్ అవుట్ కావడంతో ముంబై ఓటమి ఖరారైంది. 

బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, ప్యాటిన్సన్, రాహుల్ చాహార్‌లు 2 వికెట్లు తీయగా.. కిరన్ పోలార్డ్ ఓ వికెట్ తీశారు. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !
T20 World Cup 2026: షాకిచ్చారు భయ్యా.. స్టార్ ప్లేయర్లను బయటకు పంపించేశారు !