ముంబయి చేతిలో ఓటమి... నిరుత్సాహంలో షారూక్..

Published : Apr 14, 2021, 09:56 AM ISTUpdated : Apr 14, 2021, 10:01 AM IST
ముంబయి  చేతిలో ఓటమి... నిరుత్సాహంలో షారూక్..

సారాంశం

కాగా.. కేకేఆర్ ఓటమి అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. ఈ క్రమంలో...  ఆ జట్టు యజమాని షారూక్ ఖాన్ ఈ ఓటమిపై స్పందించాడు. అభిమానులకు క్షమాపణలు కూడా తెలియజేశాడు. 

ముంబయి చేతిలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఓటమిపాలైంది. మంగళవారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ముంబయి, కోల్ కతా జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...అందరూ కోల్ కతా గెలుస్తుందనే అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అంతా తారుమారైంది. పది పరుగుల తేడాతో కోల్ కతా ఓటమి పాలవ్వగా.. విజయం.. ముంబయిని వరించింది.

కాగా.. కేకేఆర్ ఓటమి అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. ఈ క్రమంలో...  ఆ జట్టు యజమాని షారూక్ ఖాన్ ఈ ఓటమిపై స్పందించాడు. అభిమానులకు క్షమాపణలు కూడా తెలియజేశాడు. 

ముంబయి జట్టు 152 పరుగులు చేయగా.. 153 పరుగుల లక్ష్యంతో కేకేఆర్ రంగంలోకి దిగింది.  26 బంతులు ఉన్న సమయంలో.. కేకేఆర్ 30 పరుగులు చేయాల్సి ఉంది. నితీష రానా, షుభమన్ గిల్ భాగస్వామ్యంలో 72 పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్నారు. అలాంటి సమయంలో అందరూ కేకేఆర్ దే విజయం అని అనుకున్నారు. కానీ.. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ తెలివిగా కేకేఆర్ ఆట కట్టించాడు. ఫలితంగా కేకే ఆర్ విజయం చేజార్చుకోవాల్సి వచ్చింది. 

ఈ నేపథ్యంలో.. షారూక్ ట్వీట్ చేశాడు.‘‘ ఆటతీరు చాలా నిరుత్సాహంగా ఉంది. కేకేఆర్ ఆటగాళ్లు కనీసం అభిమానులకు క్షమాపణలు చెప్పాలి’’ అంటూ ట్వీట్ చేశాడు. తొలి మ్యాచ్ గెలిచినప్పుడు ఎంతో ఆనంద పడిన షారూక్.. ఈ మ్యాచ్ ఓటమితో  చాలా నిరుత్సాహానికి గురైనట్లు ఆయన ట్వీట్ తో స్పష్టంగా అర్థమౌతోంది. 

 

PREV
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !