IPL2022: ఎవిన్ లూయిస్ అద్భుతమైన క్యాచ్ కి మార్కస్ ఫిదా..!

Published : May 19, 2022, 10:56 AM IST
IPL2022: ఎవిన్ లూయిస్ అద్భుతమైన క్యాచ్ కి మార్కస్ ఫిదా..!

సారాంశం

చివరి వరకు విజయం ఎవరికి దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. చివరకు విజయం  లక్నో జెయింట్స్ ని వరించింది. కేవలం రెండు పరుగుల తేడాతో లక్నో గెలుపు సాధించి ప్లే ఆఫ్ కి చేరింది. కాగా.. ఈ మ్యాచ్ లో.. ఓ సూపర్ క్యాచ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.  

ఐపీఎల్ 2022 రసవత్తరంగా సాగుతోంది.  బుధవారం( మే 18) న లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్.. క్రికెట్ ప్రియులను రెప్ప కూడా కొట్టనివ్వకుండా చేసింది. చివరి వరకు విజయం ఎవరికి దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. చివరకు విజయం  లక్నో జెయింట్స్ ని వరించింది. కేవలం రెండు పరుగుల తేడాతో లక్నో గెలుపు సాధించి ప్లే ఆఫ్ కి చేరింది. కాగా.. ఈ మ్యాచ్ లో.. ఓ సూపర్ క్యాచ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రారంభం నుంచి ధాటిగానే ఆడింది. అయితే 15 ఓవర్ల ముగిసేసరికి కీలకమైన వికెట్లు పడిపోవడమే కాకుండా రిక్వైర్డ్ రన్‌రేట్ ఏకంగా 20 దాటి ఉండటంతో ఇక విజయంపై ఆశలు వదిలేసుకుంది. ఆ తరుణంలో రింకూ సింగ్ ఆడిన స్మాషింగ్ ఇన్నింగ్స్ కేకేఆర్ జట్టును విజయం అంచులవరకూ తీసుకెళ్లింది. విజయం అందుకోవల్సిందే..కానీ రింకూసింగ్ ఆడిన షాట్‌ను ఎవిన్ లూయిస్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో కేకేఆర్ జట్టు విజయం అందుకోలేకపోయింది. రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. రింకూ సింగ్ కేవలం 15 బంతుల్లో 40 పరుగులు చేశాడు. 

చివర్లో 2 బంతుల్లో 3 పరుగులు కావల్సి ఉండగా..రింకూసింగ్ ఆడిన స్క్వేర్ షాట్‌ను ఎక్కడో దూరంగా ఉన్న ఎవిన్ లూయిస్..అత్యద్భుతంగా పర్ఫెక్ట్ డైవింగ్‌తో ఎడమచేతితో పట్టుకోగలిగాడు. అంతే రింకూ సింగ్ నిరాశగా వెనుదిరిగాడు. రీప్లేలో చూస్తేగానీ చాలామందికి అర్ధం కాలేదు. ఎంత అద్భుతమైన డైవ్ సింగిల్ హ్యాండెడ్ క్యాట్ అనేది. ఆ తరువాత బంతికి..రింకూ స్థానంలో వచ్చిన ఉమేష్ యాదవ్ క్లీన్‌బౌల్డ్ అవడంతో 2 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.

కాగా.. ఎవిన్ లూయిస్ అద్భుతమైన క్యాచ్ పై మార్కస్ స్పందించాడు.ఎవిన్ లూయిస్ కేవలం సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టాడని చెప్పాడు. అతనికి తాము ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇస్తున్నామంటూ పేర్కొన్నాడు. ఎవిన్ బ్యాటింగ్ కూడా చేయాలని ఎదురుచూస్తున్నాడని పేర్కొన్నాడు. 

PREV
click me!

Recommended Stories

Rohit Sharma : హిట్ మ్యాన్ కెరీర్ లో అత్యంత కఠిన సమయం ఇదే.. అసలు విషయం చెప్పిన రోహిత్!
కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?