IPL2022: డీకాక్ విధ్వంసం.. సెల్యూట్ చేసిన కేఎల్ రాహుల్..!

By telugu news teamFirst Published May 19, 2022, 10:19 AM IST
Highlights

లక్నో ఓపెనర్లు డికాక్‌ (70 బంతుల్లో 140 నాటౌట్‌; 10 ఫోర్లు, 10 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (51 బంతుల్లో 68 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు)లు ఆకాశమే హద్దుగా చెలరేగి చాలాకాలం తర్వాత అసలైన ఐపీఎల్‌ మజాను ప్రేక్షకులకు అందించారు.

ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. బుధవారం(మే 18) లక్నో సూపర్ జెయింట్స్- కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో.. క్రికెటర్లు రెచ్చిపోయి మరీ ఆడారు. నిన్నటి మ్యాచ్ ప్రేక్షకులకు కన్నులపండగ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా కేఎల్ రాహుల్- డీకాక్ లు తమ బ్యాట్లతో చెలరేగిపోయారు.

లక్నో ఓపెనర్లు డికాక్‌ (70 బంతుల్లో 140 నాటౌట్‌; 10 ఫోర్లు, 10 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (51 బంతుల్లో 68 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు)లు ఆకాశమే హద్దుగా చెలరేగి చాలాకాలం తర్వాత అసలైన ఐపీఎల్‌ మజాను ప్రేక్షకులకు అందించారు.

కాగా.. డీకాక్ 140 పరుగులు చేయడం జట్టు గెలుపు సులభతరం అయ్యిందనే చెప్పాలి. IPL 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను LSG 2 పరుగుల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్ బెర్త్‌ను పొందడంతో డి కాక్ తన ఇన్నింగ్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కాగా.. డీకాక్ ఆటకు ఫిదా అయిపోయిన కేఎల్ రాహుల్.. సెల్యూట్ చేశాడు.


డి కాక్‌తో కలిసి 210 పరుగుల అజేయ భాగస్వామ్యంతో అజేయంగా 68 పరుగులు చేసిన KL రాహుల్, KKR బౌలర్ల పై కూడా ప్రశంసలు కురిపించాడు. తాను ప్రేక్షకుడిలా మారి ఆటను చూశానని చెప్పాడు.  చివరి నిమిషం వరకు విజయం ఎవరిని వరిస్తుందో ఎవరికీ తెలియలేదు. తాను కూడా ప్రేక్షకుడిలా మారి.. ఫలితం కోసం ఎదురు చూసినట్లు కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.

కెకెఆర్‌తో జరిగిన మ్యాచ్‌ల వంటి క్లోజ్ గేమ్‌లు ఎల్‌ఎస్‌జికి ప్లేఆఫ్స్‌లోకి వెళ్లేందుకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయని కెఎల్ రాహుల్ చెప్పాడు మరియు లీగ్ దశను ముగించడానికి ఇది మంచి మార్గమని చెప్పాడు.

"నేను బహుశా ఇలాంటి గేమ్‌లకు ఎక్కువ వేతనం పొందుతాను. ఈ సీజన్‌లో మేము ఇలాంటి ఆటలను కోల్పోయాము. చివరి బంతి వరకు చాలా గేమ్‌లు జరగలేదు, కొన్ని చివరి ఓవర్ వరకు వెళ్లి ఉండవచ్చు" అని రాహుల్ చెప్పాడు. .

click me!