6 బంతుల్లో 6 సిక్సర్లు... 9 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీతో విధ్వంసం.. వీడియో వైరల్

By Mahesh RajamoniFirst Published Apr 13, 2024, 9:09 PM IST
Highlights

Dipendra Singh Airee : దీపేంద్ర సింగ్ ఎయిరీ సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 9 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. వ‌రుస‌గా 6 బంతుల్లో 6 సిక్సర్ల ఇన్నింగ్స్ తో యువ‌రాజ్ సింగ్ రికార్డును  సమం చేశాడు.

Dipendra Singh Airee : దీపేంద్ర సింగ్ ఐరీ ప్రపంచ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించాడు. వ‌రుస‌గా ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు బాద‌డంతో పాటు కేవ‌లం 9 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టి రికార్డుల మోత మోగించాడు. ఈ నేపాల్ బ్యాట్స్‌మెన్ అనేక అంత‌ర్జాతీయ రికార్డుల‌ను నెల‌కోల్ప‌డంతో పాటు భార‌త స్టార్ ఆల్ రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్, వెస్టిండీస్ సంచ‌ల‌నం కీర‌ణ్ పొలార్డ్ రికార్డుల‌ను సైతం బ్రేక్ చేశాడు. ఖతార్‌తో జరిగిన ఏసీసీ పురుషుల టీ20 ఇంటర్నేషనల్ ప్రీమియర్ లీగ్ కప్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. దీపేంద్ర 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20లో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు భారత ఆటగాడు యువరాజ్‌ సింగ్‌, వెస్టిండీస్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ ఈ ఘనత సాధించారు.

300 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగుల వ‌ర‌ద‌.. 

మ్యాచ్‌లో నేపాల్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. దీపేంద్ర సింగ్ 21 బంతుల్లో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన పేలుడు ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. దీపేంద్ర 304.76 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. వీరితో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆసిఫ్ షేక్ 41 బంతుల్లో 52 పరుగులు, కుశాల్ మల్లా 18 బంతుల్లో 35 పరుగులు చేశారు.

6, 6, 6, 4, 4, 6.. ఎవ‌డ్రా ఈ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్? వ‌స్తూనే తొలి మ్యాచ్ లో ఇలా కొట్టేశాడు.. !

 

𝗨𝗡𝗥𝗘𝗔𝗟 😵‍💫 pic.twitter.com/72Itd5INE1

— AsianCricketCouncil (@ACCMedia1)

 

యువరాజ్, పొలార్డ్ క్లబ్‌లో దీపేంద్ర

నేపాల్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కమ్రాన్ ఖాన్‌ బౌలింగ్ ను ఉతికిపారేశాడు దీపేంద్ర. ఖతార్ బౌలర్ కమ్రాన్ వేసిన మొత్తం ఆరు బంతుల్లో అతను సిక్సర్లు బాదాడు. దీపేంద్ర కంటే ముందు టీ20 ఇంటర్నేషనల్‌లో యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో యువరాజ్ ఆరు సిక్సర్లు బాదాడు. పొలార్డ్ 2021లో శ్రీలంకపై అకిలా ధనంజయ్ బౌలింగ్ లో ఈ ఘనత సాధించాడు. 

దీపేంద్ర రికార్డులు.. 

ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు దీపేంద్ర పేరిట ఉంది. గతేడాది ఆసియా క్రీడల సందర్భంగా హాంగ్‌జౌలో మంగోలియాపై 9 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 300 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో టీ20 క్రికెట్‌లో రెండుసార్లు యాభై పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా దీపేంద్ర నిలిచాడు. అతను మంగోలియాపై 10 బంతుల్లో 52* పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో నిషేధానికి గురయ్యే ప్రమాదంలో రిష‌బ్ పంత్.. !

click me!