KKR vs DC Highlights: కళ్లు చెదిరే షాట్స్.. సునీల్ నరైన్, బైభవ్ ల సూపర్ ఇన్నిగ్స్, ఢిల్లీపై కేకేఆర్ గెలుపు

By Mahesh Rajamoni  |  First Published Apr 4, 2024, 12:08 AM IST

KKR vs DC Highlights :  విశాఖ‌ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2024 16వ మ్యాచ్ లో కోల్ క‌తా టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. సునీల్ న‌రైన్, బైభ‌వ్ అరోరా మెరుపులు, చివ‌ర‌లో ఆండ్రీ రస్సెల్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్, రెచ్చిపోయిన‌ రింకు సింగ్ ఇన్నింగ్స్ ల‌తో కేకేఆర్ త‌న అధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. 
 


KKR vs DC Highlights : విశాఖ‌ప‌ట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో బుధ‌వారం బౌండ‌రీల వ‌ర్షం కురిసింది. ఫోర్లు, సిక్స‌ర్ల మోత కొన‌సాగింది. ఢిల్లీ బౌలింగ్ ను చిత్తు చేసిన కేకేఆర్ ఐపీఎల్ 2024 సీజ‌న‌ల్ అత్య‌ధిక స్కోర్ చేసిన రెండో టీమ్ గా ఘ‌న‌త సాధించింది. ఏకంగా 106 ప‌రుగుల‌తో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) టీమ్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 272 ప‌రుగులు చేసింది. భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కేవలం 166 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

Latest Videos

ధ‌నాధ‌న్ బ్యాటింగ్.. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్.. బ్యాటింగ్ కు దిగింది. తొలి రెండు ఓవ‌ర్ల‌లో పెద్దగా ప‌రుగులు చేయ‌క‌పోయినా.. ఆ త‌ర్వాత కేకేఆర్ టీమ్ విధ్వంసం సృష్టించింది. ఖలీల్ అహ్మద్ వేసిన 3వ ఓవర్లో 3 ఫోర్లు సహా 15 పరుగులు వచ్చాయి. ఇక 4వ ఓవ‌ర్ లో విధ్వంసం కొన‌సాగింది. ఇషాంత్ శర్మ వేసిన 4వ ఓవర్లో సునీల్ నరైన్ 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. 18 పరుగుల వద్ద దూకుడుగా ఆడుతున్న‌ సాల్ట్ ఔట్ కావ‌డంతో 18 ఏళ్ల అరంగేట్ర ఆటగాడు రఘువంశీ కేకేఆర్ ఇన్నింగ్స్ ను ముందుకు న‌డిపించాడు. సునీల్ న‌రైన్ విధ్వంసం, ర‌ఘువంశీ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపారు. ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు కలిసి ఢిల్లీ బౌలర్లను వైట్ వాష్ చేశారు. సునీల్ నరైన్ 21 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 88 పరుగులు చేసింది.

ఇదేమీ ఆట‌రా బాబు.. గ్రౌండ్ లో ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించారు.. చ‌రిత్ర సృష్టించిన కేకేఆర్

దూకుడుగా ఆడిన సునీల్ నరైన్ సెంచరీ కొట్టేలా క‌నిపించాడు కానీ, 39 బంతుల్లో 7 సిక్సర్లు, 7 ఫోర్లతో 85 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మ‌రో ఎండ్ లో అరంగేట్రంలోనే ర‌ఘువంశీ అద‌ర‌గొట్టాడు. అద్భుతంగా ఆడిన రఘువంశీ 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. భారీ షాక్ కు ఆడ‌బోయే 54 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రింకూ సింగ్, ర‌స్సెట్ దుమ్మురేపాడు. 19వ ఓవర్‌లో 3 సిక్సర్లు, ఒక బౌండరీతో సహా 25 పరుగులు రాబ‌ట్టాడు. ఈ ఓవర్ చివరి బంతికి రింగు సింగ్ ఔట్ అయ్యాడు కానీ, 8 బంతుల్లో 26 పరుగులు కొట్ట‌డం విశేషం. 19 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఇషాంత్‌ శర్మను చివరి ఓవర్ వేయ‌గా, తొలి బంతికి రస్సెల్ 41 పరుగుల వద్ద అవుట్ కాగా, 3వ బంతికి రమణదీప్ సింగ్ 2 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ ఓవర్ లో కేవ‌లం 8 పరుగులు మాత్ర‌మే రావ‌డంతో  కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.

అద్భుత‌మైన బౌలింగ్.. 

ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి, ఆల్ రౌండ్ షోతో ఢిల్లీ  పై గెలుపొంది. 173 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ టీమ్ కు వరసగా షాక్ లు తగిలాయి. రెండో ఓవర్ లోనే షా (18 పరుగుల) ఔట్ అయ్యాడు. రిషబ్ పంత్, స్టబ్స్ డీసీకి విజయం అందించాల చూశారు. ఈ క్రమంలోనే భారీ షాట్లు ఆడారు. రిషబ్ పంత్ 25 బంతుల్లో 55 పరుగుల తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ట్రిస్టాన్ స్టోబ్స్ 32 బంతుల్లో 54 పరుగులు చేసి ఔట్ అయ్యారు. మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించకపోవడంతో 166 పరుగులకే కుప్పకూలింది. కోల్ కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, వైభవ్ అరోరా 3 వికెట్లు, వరుణ్ ఛక్రవర్తి 3 వికెట్లు తీసుకున్నాడు.

18 సిక్స్‌లు, 22 ఫోర్లు..ఢిల్లీని చిత‌క్కొట్టిన కోల్‌కతా..

click me!