KKR vs DC : వైజాగ్ లో సునీల్ నరైన్ సునామీ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. మరో ఎండ్ లో యంగ్ ప్లేయర్ రఘువంశి సూపర్బ్ షాట్స్ తో దుమ్మురేపాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
KKR vs DC Sunil Narine : వైజాగ్ లో బౌండరీల వర్షం కురిసింది. ఫోర్లు, సిక్సర్ల మోత కొనసాగింది. విశాఖ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 16వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్ ఢిల్లీ బౌలర్లకు చెక్కలు చూపించాడు. తన బ్యాట్ తో ఎలా విధ్వంసం చేస్తాడో మరోసారి నిరూపించాడు. దుమ్మురేపే క్రాకింగ్ షాట్స్ తో తన సత్తా చాటాడు. మరో ఎండ్ లో యంగ్ ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కేకేఆర్ ఐపీఎల్ 2024 లో సరికొత్త రికార్డు సృష్టించింది. పవర్ ప్లే లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఘనత సాధించింది.
ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రెండు ఓవర్లలో నెమ్మదిగా ఆడిన కేకేఆర్ ఒపెనర్లు ఆ తర్వాత దూకుడు పెంచాడు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సునీల్ నరైన్ ఢిల్లీ బౌలింగ్ ను చీల్చిచెండాడాడు. బౌండరీల మోత మోగించాడు. నరైన్ ఆటతో స్టేడియం హోరెత్తిపోయింది. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టిన సునీల్ నరైన్.. 85 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తన 217.95 స్ట్రైక్ రేట్ ఇన్నింగ్స్ 7 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. మరో ఎండ్ లో రఘువంశీ 25 బంతుల్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 27 బంతుల్లో 54 పరుగులు చేసిన రఘువంశీ 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్ లో పవర్ ప్లే లో అత్యధిక పరుగులు చేసిన టీమ్ గా ఘనత సాధించింది. వైజాగ్ లో ఢిల్లీ పై పవర్ ప్లే లో 88/1 పరుగులు సాధించింది.
కేకేఆర్ ఐపీఎల్ లో పవర్ ప్లే లో సాధించిన పరుగులు ఇలా ఉన్నాయి..
105/0 vs ఆర్సీబీ బెంగళూరు, 2017
88/1 vs ఢిల్లీ క్యాపిటల్స్ , వైజాగ్, 2024
85/0 vs ఆర్సీబీ, బెంగళూరు, 2024
76/1 vs పంజాబ్, కోల్ కతా, 2017
73/0 vs గుజరాత్, రాజ్ కోట్ 2017
Sunil Narine at it again 🔥🔥 are off to some start in Vizag!
Head to and to watch the match LIVE | pic.twitter.com/UipTFUHznQ
క్రాకింగ్ షాట్స్.. ఢిల్లీ బౌలింగ్ ను చీల్చిచెండాడిన సునీల్ నరైన్.. !