IPL 2024: కోల్‌కతా నైట్ రైడర్స్ వీళ్లే.. రికార్డు స్థాయిలో కొనుగోలు..

By Rajesh Karampoori  |  First Published Dec 20, 2023, 6:55 AM IST

KKR squad IPL 2024: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 32.7 కోట్ల రూపాయలతో ఐపిఎల్ వేలంలోకి ప్రవేశించింది. మిచెల్ స్టార్క్ కోసం రూ. 24.75 కోట్ల రికార్డుతో సహా మొత్తం 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టు గరిష్ట సంఖ్యలో ఆటగాళ్లను విడుదల చేసింది. ఇప్పుడు వేలం తర్వాత జట్టు మొత్తం 23 మంది ఆటగాళ్లను కలిగి ఉంది, ఇందులో ఎనిమిది మంది విదేశీయులు ఉన్నారు. పూర్తి జట్టు వివరాలిలా..


IPL 2024 Kolkata Knight Riders: IPL వేలంలో మిచెల్ స్టార్క్‌తో సహా 10 మంది ఆటగాళ్లను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. షారుక్ ఖాన్ బృందం మిచెల్ స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విధంగా మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మిచెల్ స్టార్క్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ జట్టులో ముజీబ్ ఉర్ రెహమాన్, చేతన్ సకారియా, శ్రీకర్ భరత్ , షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ వంటి ఆటగాళ్లను చేర్చుకుంది.

KKR కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీళ్లే.. 

Latest Videos

కోల్‌కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్ (24.75 కోట్లు), ముజీబ్ ఉర్ రెహమాన్ (2 కోట్లు), గుస్ అట్కిన్సన్ (1 కోటి), చేతన్ సకారియా (50 లక్షలు), రమణదీప్ సింగ్ (20 లక్షలు), శ్రీకర్ భరత్ (50 లక్షలు), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ ( 1.50 కోట్లు), అంక్రిష్ రఘువంశీ (20 లక్షలు), మనీష్ పాండే (50 లక్షలు), సాకిబ్ హుస్సేన్ (20 లక్షలు) 

KKR నిలుపుకున్న ఆటగాళ్లు-

జాసన్ రాయ్, నితీష్ రాణా, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, రహ్మానుల్లా గుర్బాజ్, ఆండ్రీ రస్సెల్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రానా, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా మరియు వరుణ్ చక్రవర్తి.

KKR పూర్తి జట్టు-

  • జాసన్ రాయ్,
  • నితీష్ రాణా,
  • రింకు సింగ్,
  • శ్రేయాస్ అయ్యర్,
  • రహ్మానుల్లా గుర్బాజ్,
  • ఆండ్రీ రస్సెల్,
  • అనుకూల్ రాయ్,
  • సునీల్ నరైన్,
  • వెంకటేష్ అయ్యర్,
  • హర్షిత్ రానా,
  • సుయాష్ శర్మ,
  • వైభవ్ అరోరా
  • వరుణ్ చక్రవర్తి,
  • మిచెల్ స్టార్క్,
  • ముజీబ్స్ రహ్‌మాన్,
  • ముజీబ్స్ సకారియా,
  • రమణదీప్ సింగ్,
  • శ్రీకర్ భరత్,
  • షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్,
  • అంక్రిష్ రఘువంశీ,
  • మనీష్ పాండే,  
  • సాకిబ్ హుస్సేన్.

స్క్వాడ్ బలం: 23

విదేశీ ఆటగాళ్లు: 8

KKR పర్స్ లో మిగిలి ఉంది: రూ. 1.35 కోట్లు

ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. కాగా, నితీష్ రానా వైస్ కెప్టెన్ పాత్రలో కనిపించనున్నారు. అంతకుముందు గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ IPL 2023 సీజన్‌లో ఆడలేకపోయాడు. శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీతో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీని నితీష్ రాణా చేపట్టాడు.

click me!