సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్‌ మోచేతి గాయానికి శస్త్రచికిత్స పూర్తి... సోషల్ మీడియా ద్వారా...

Published : Apr 27, 2021, 04:00 PM IST
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్‌ మోచేతి గాయానికి శస్త్రచికిత్స పూర్తి... సోషల్ మీడియా ద్వారా...

సారాంశం

మోచేతి గాయంతో ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమైన నటరాజన్... నెలన్నరగా మోచేతి గాయంతో బాధపడుతున్న నట్టూ... గాయం తిరగబెట్టడంతో సర్జరీ నిర్వహించిన వైద్యులు..

ఐపీఎల్ 2020 సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టిన నటరాజన్‌,  గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌ మధ్యలోనే దూరమైన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఎంట్రీ ఇచ్చి, తన ప్రదర్శనతో విమర్శకులను మెప్పించిన నట్టూ, ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్‌ ముందే గాయపడ్డాడు.నెలన్నర రోజుల పాటు జాతీయ క్రికెట్ అకాడమీలో ట్రైయినింగ్ తీసుకున్న నటరాజన్, ఐపీఎల్ 2021 సీజన్‌లో రెండు మ్యాచులు ఆడాడు.

అయితే అతని మోచేతికి అయిన గాయం తిరగబెట్టడంతో శస్త్రచికిత్స అవసరమని తేల్చారు వైద్యులు. ‘ఈరోజ నా మోచేతికి సర్జరీ పూర్తయ్యింది. మెడికల్ టీమ్, సర్జన్లు, డాక్టర్లు, స్టాఫ్ చూపించిన కేర్‌, అటెక్షన్‌కి ధన్యవాదాలు. నా బాగు కోసం విష్ చేసిన అందరికీ థ్యాంక్యూ’ అంటూ ట్వీట్ చేశాడు నటరాజన్. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఐపీఎల్ వేలంలో రూ. 74 కోట్లు కొల్లగొట్టిన ఐదుగురు ప్లేయర్లు వీరే!
IND vs SA : టీమిండియాకు బిగ్ షాక్