కర్ణాటకలో మరో బుమ్రా

By Siva KodatiFirst Published Mar 27, 2019, 1:11 PM IST
Highlights

ఐపీఎల్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో మంగళవారం ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దానికి కవర్ చేయడానికి వచ్చిన కొందరు మీడియా ప్రతినిధులకు నెట్స్‌లో ఒక దృశ్యం ఆశ్చర్యపరిచింది. 

ఐపీఎల్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో మంగళవారం ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దానికి కవర్ చేయడానికి వచ్చిన కొందరు మీడియా ప్రతినిధులకు నెట్స్‌లో ఒక దృశ్యం ఆశ్చర్యపరిచింది.

ముంబై జట్టులో ఉన్న జస్ప్రీత్ బుమ్రా.. బెంగళూరు జట్టు బ్యాట్స్‌మెన్లకు బౌలింగ్ చేస్తున్నాడు. అయితే అతనిని దగ్గరికి వెళ్లి పరీక్షించగా అతను బుమ్రా కాదు.. అండర్ -19 కర్ణాటక జట్టు మాజీ క్రికెటర్. రాజధాని బెంగళూరుకు సమీపంలోని దొడ్డబళ్లాపూర్‌కు చెందిన కుమార్ గతంలో అండర్-19 కర్ణాటక జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు.

అలాగే బెంగళూరు వీవీపురంలో ఉన్న క్రికెట్ క్లబ్ తరపున ఆడేవాడు. ఇతనికి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని కోరిక. ముంబైతో మ్యాచ్ నిమిత్తం ప్రాక్టీస్ కోసం రాయల్ ఛాలెంజర్స్ కొందరు స్థానిక బౌలర్లను పిలిపించింది.

ఈ క్రమంలో బెంగళూరు జట్టు డ్రెస్సింగ్ రూమ్ వేచి ఉన్న కుమార్‌ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ సహాయక సిబ్బంది జోక్యం చేసుకుని కుమార్‌ని డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. టీమిండియా మాజీ పేసర్, ప్రస్తుత బెంగళూరు బౌలింగ్ కోచ్‌గా ఉన్న అశీష్ నెహ్రా అతనికి కొత్త షూతో పాటు జెర్సీ అందజేశాడు.

మహేశ్‌ను కలిసిన కొందరు మీడియా మిత్రులు మీరు బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను కాపీ కొడుతున్నారని ప్రశ్నించగా.. అందుకు స్పందించిన అతను తాను బుమ్రా యాక్షన్‌ను కాపీ కొట్టడం లేదని తన ఎనిమిదవ ఏట నుంచి ఇదే యాక్షన్‌తో బౌలింగ్ చేస్తున్నట్లు తెలిపాడు.

బుమ్రా ఎంట్రీ తర్వాత తన పేస్‌లో పదును పెంచుకుంటున్నట్లు చెప్పాడు. 2017లో భారత జాతీయ జట్టుకు తాను మొదటిసారి బెంగళూరులో బౌలింగ్‌లో చేశానని అప్పటి నుంచి టీమిండియా ఎప్పుడు కర్ణాటక వచ్చినా తానే నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నట్లు మహేశ్ కుమార్ తెలిపాడు.

ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న కుమార్ .. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్ని తన తండ్రి కలను నెరవేర్చే పనిలో ఉన్నాడు. బెంగళూరులోని సాయి విద్యా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వార్షికోత్సవాలకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన తనను అక్కడి వారు మరో బుమ్రాగా అభివర్ణించారని మహేశ్ తెలిపాడు.

టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తనకు పూర్తి మద్ధతుగా నిలిచారని అలాగే ఆశీష్ నెహ్రా బౌలింగ్‌కు సంబంధించి కొన్ని సలహాలు ఇచ్చారని చెప్పాడు. అలాగే తాను నెట్స్‌లో బుమ్రాను కలిశానని చాలా సేపు తామిద్దరం మాట్లాడుకున్నట్లు మహేశ్ వెల్లడించాడు.

ఆస్ట్రేలియా జట్టు కోచింగ్ విభాగానికి చెందిన కొందరు తనను మెల్‌బోర్న్‌లో ఆడాల్సిందిగా కోరారని అయితే తాను అందుకు అంగీకరించలేదని మహేశ్ స్పష్టం చేశాడు. తనకు బెంగళూరులో ఉండటమంటనే ఇష్టమని తెలిపాడు. 
 

click me!