మొన్న మహారాష్ట్ర, నేడు కర్ణాటక, రేపు ఎవరో: ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు

By Siva Kodati  |  First Published Mar 10, 2020, 5:18 PM IST

కరోనా వల్ల ఐపీఎల్ ఆగదని ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ కుమార్ చెప్పినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతూనే ఉన్నాయి.


కరోనా వల్ల ఐపీఎల్ ఆగదని ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ కుమార్ చెప్పినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతూనే ఉన్నాయి.

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా భయంతో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల క్రితం మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ఐపీఎల్‌ను వాయిదా వేయాలని బీసీసీఐకి విజ్ఞప్తికి చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి కర్ణాటక చేరింది.

Latest Videos

Also Read:ఇప్పుడు ఐపీఎల్ అవసరమా: మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

బెంగళూరుకు చెందిన ఓ టెక్కీకి కరోనా వైరస్ సోకిందని ఆ రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి కే. సుధాకర్ సోమవారం ప్రకటించారు. అమెరికా నుంచి తిరిగొచ్చిన ఆ వ్యక్తికి దాదాపు 2,666 మందిని కలిసినట్లు ఆయన తెలిపారు.

కరోనా బాధితుడిని నగరంలోని రాజీవ్ గాంధీ చెస్ట్ హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వైరస్ ఇతరులకు వ్యాపించకుండా సాఫ్ట్‌వేర్ సంస్థలున్న ప్రదేశాల్లోని ప్రాథమిక పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సర్కార్ నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది.

ఈ నెలాఖరు నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం ఆందోళనకు గురవుతోంది. ప్రస్తుతానికి ఐపీఎల్ వాయిదాపై ఎలాంటి వార్తలు రాకపోయినప్పటికీ బెంగళూరులో జరిగే దానిపై మాత్రం అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Also Read:భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్‌కు నో ప్రాబ్లమ్: లీగ్ కమిటీ

నగరానికి చెందిన స్థానిక టీవీ ఛానెల్ ప్రసారం చేసిన వార్తా కథనంలో కరోనా వైరస్ ముప్పు దృష్ట్యా బెంగళూరులో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేమని కేంద్రానికి స్పష్టం చేసింది.

ఈ మేరకు ఓ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత గ్రౌండ్ చిన్న స్వామి స్టేడియం. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా కర్ణాటక ప్రభుత్వం భయపడుతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి. 

click me!