గంభీర్ నవ్వుతూ ఏదో అన్నాడు! అంతే గొడవ జరిగింది... మధ్యలో ఇషాంత్ శర్మ వచ్చి రచ్చ రచ్చ చేసి...

Published : Feb 25, 2023, 03:34 PM IST
గంభీర్ నవ్వుతూ ఏదో అన్నాడు! అంతే గొడవ జరిగింది... మధ్యలో ఇషాంత్ శర్మ వచ్చి రచ్చ రచ్చ చేసి...

సారాంశం

ఆసియా కప్ 2009 సమయంలో గౌతమ్ గంభీర్‌తో గొడవ పడిన కమ్రాన్ అక్మల్.. 2012లో ఇషాంత్ శర్మ- కమ్రాన్ అక్మల్ మధ్య గొడవ... యూట్యూబ్‌లో పాత విషయాలను పంచుకున్న పాక్ మాజీ వికెట్ కీపర్.. 

ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఓ సాధారణ క్రికెట్ మ్యాచ్‌లా ఉండదు. రెండు దేశాల మధ్య ఎమోషనల్ యుద్ధంలా జరుగుతుంది. ఇప్పుడు ఇరు దేశాల ప్లేయర్లు ఫ్రెండ్స్‌లా కలిసిపోయి, సరదాగా మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇంతకుముందు అలా ఉండేది కాదు...

2009 ఆసియా కప్ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్, కమ్రాన్ అక్మల్ మధ్య మాటామాటా పెరిగి పెద్ద వాగ్వాదమే జరిగింది. 2012లోనూ ఇషాంత్ శర్మ, కమ్రాన్ అక్మల్ మధ్య ఇలాంటి మాటల యుద్ధమే జరిగింది. తాజాగా ఈ రెండు సంఘటనల గురించి ఓపెన్ అయ్యాడు పాకిస్తాన్ సీనియర్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్...

‘2009 ఆసియా కప్ మ్యాచ్‌లో గొడవకి అపార్థమే కారణం. సయ్యద్ అజ్మల్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో గౌతమ్ గంభీర్ క్రీజులో ఉన్నాడు. నేను క్యాచ్ అప్పీల్ చేశాను, అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అంపైర్ నాటౌట్ అనగానే గంభీర్ నవ్వుతూ ఏదో అన్నాడు...

అయితే అతను ఏమన్నాడో నాకు వినిపించలేదు, అర్థం కాలేదు కూడా. అయితే ఇండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్. వేల మధ్య ప్రేక్షకుల అరుపులు, గోలలు, ఆ ప్రెషర్ మధ్యలో నాకు గంభీర్, నన్ను తిట్టినట్టే అనిపించింది. అతనేమీ నన్ను తిట్టలేదు. తనను తానే తిట్టుకున్నాడు...

అయితే అతనికి దగ్గరలో నేను ఉండడం, నేనే క్యాచ్‌కి అప్పీలు చేయడంతో నన్నే తిట్టాడని అనుకున్నా... ఆ తర్వాత ఆ మ్యాచ్ వీడియో చూశాక అసలు విషయం అర్థమైంది... ఆ గొడవలో గంభీర్ తప్పేం లేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు కమ్రాన్ అక్మల్...

2009 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 267 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సల్మాన్ బట్ 74 పరుగులు చేయగా ఇమ్రాన్ ఫర్హత్ 25, షోయబ్ మాలిక్ 39, ఉమర్ అక్మల్ 21 పరుగులు చేయగా షాహిద్ ఆఫ్రిదీ 32, కమ్రాన్ అక్మల్ 51 పరుగులు చేశారు. 

భారత బౌలర్లలో ప్రవీణ్ కుమార్ 3 వికెట్లు తీయగా జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ రెండేసి వికెట్లు తీశారు. రవీంద్ర జడేజాకి ఓ వికెట్ దక్కింది. 268 పరుగుల లక్ష్యాన్ని ఒక్క బంతి మిగిలి ఉండగా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. గౌతమ్ గంభీర్ 83 పరుగులు చేయగా సెహ్వాగ్ 10, విరాట్ కోహ్లీ 18 . ధోనీ 56, రోహిత్ శర్మ 22, సురేష్ రైనా 34 పరుగులు చేయగా హర్భజన్ సింగ్ 15 పరుగులు చేసి.. రెండు సిక్సర్లతో మ్యాచ్‌ని ముగించాడు..

ఉగ్ర దాడుల తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోయాయి. చివరిగా 2012లో భారత్‌లో పర్యటించింది పాకిస్తాన్. ఈ సమయంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ, కమ్రాన్ అక్మల్ మధ్య ఇలాంటి ఫైటే జరిగింది. ఈ మ్యాచ్‌లో కమ్రాన్ అక్మల్, ఇషాంత్ శర్మ కొట్టుకునేంత పని చేశారు.  


‘నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇషాంత్ శర్మ నన్ను ఏదో తిట్టాడు. నేను వెంటనే ఒకటికి మూడు తిట్టాను. ఎంఎస్ ధోనీ, టీమిండియా కెప్టెన్.. చాలా మంచి వ్యక్తి. అతనితో పాటు సురేష్ రైనా వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఇండియా అప్పటికే మ్యాచ్ ఓడిపోయే పొజిషన్‌లో ఉంది. ఆ సమయంలో ఇలా జరిగింది. షోయబ్ మాలిక్, మహ్మద్ హాఫీజ్... ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో బాగా బాగా పరుగులు రాబట్టారు. అందుకే ఇషాంత్ తట్టుకోలేకపోయాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు కమ్రాన్ అక్మల్...

బెంగళూరులో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. గౌతమ్ గంభీర్ 43, అజింకా రహానే 42 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 9, యువరాజ్ సింగ్ 10, ధోనీ 1, సురేష్ రైనా 10, రోహిత్ శర్మ 2, రవీంద్ర జడేజా 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు...

పాక్ ఓపెనర్లు నసీర్ జంషెడ్ 2, అహ్మద్ షాజద్ 5, ఉమర్ అక్మల్ డకౌట్ అయినా మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ కలిసి పాక్‌కి విజయాన్ని అందించారు. హఫీజ్ 61 పరుగులు చేసి అవుట్ కాగా షోయబ్ మాలిక్ 57 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు. కమ్రాన్ అక్మల్ ఈ మ్యాచ్‌లో 6 బంతులు ఆడి 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు..

PREV
click me!

Recommended Stories

సింహం ఒక్క అడుగు వెనక్కి.. కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడతానన్నది ఇందుకేనా.?
గుర్తుపెట్టుకో.! 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆ ఇద్దరినీ ఎవరూ ఆపలేరు.!