మళ్లీ రవిశాస్త్రేనా లేక మరొకరా: 16న ఉత్కంఠకు తెర

Siva Kodati |  
Published : Aug 14, 2019, 12:41 PM ISTUpdated : Aug 14, 2019, 12:46 PM IST
మళ్లీ రవిశాస్త్రేనా లేక మరొకరా: 16న ఉత్కంఠకు తెర

సారాంశం

టీమిండియా ప్రధాన కోచ్ ఎవరో ఈ నెల 16న తేలిపోనుంది. కోచ్ ఎంపిక కోసం ఏర్పాటైన కపిల్ దేవ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆ రోజున కోచ్ ఎంపిక ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది.

టీమిండియా ప్రధాన కోచ్ ఎవరో ఈ నెల 16న తేలిపోనుంది. కోచ్ ఎంపిక కోసం ఏర్పాటైన కపిల్ దేవ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆ రోజున కోచ్ ఎంపిక ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది.

టీమిండియా హెడ్ కోచ్ పదవి సహా మరికొన్ని పోస్టుల కోసం దాదాపు 2 వేల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలోంచి టామ్ మూడీ, మైక్ హెసెన్, ఫిల్ సిమన్స్, రాబిన్ సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుట్‌, రవిశాస్త్రిలతో తుది జాబితా రూపొందించారు.

అనంతరం ఈ ఆరుగురికి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.

నేరుగా ముంబైకి రాలేని వారు స్కైప్ ద్వారా ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చని కపిల్‌దేవ్ కమిటీ స్పష్టం చేసింది. ప్రధాన కోచ్‌గా మళ్లీ రవిశాస్త్రినే కొనసాగించాలని విరాట్ కోహ్లీతో పాటు అన్షుమన్ గైక్వాడ్ మరికొందరు మాజీలు బహిరంగంగానే మద్ధతు ప్రకటిస్తున్నారు.

అయితే టామ్ మూడీ, మైక్ హెసన్‌ల నుంచి శాస్త్రికి గట్టిపోటీ ఎదురుకానుంది. సెలక్షన్ కమిటీలో కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి ఉన్నారు. కాగా.. ప్రధాన కోచ్‌ను మినహాయించి మిగిలిన పోస్టులకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !