గంగూలీకి ప్రధాని మోడీ ఫోన్.. కోలుకోవాలని ఆకాంక్ష

By Siva KodatiFirst Published Jan 3, 2021, 10:26 PM IST
Highlights

ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ఆదివారం గంగూలీ, ఆయన భార్య డోనా గంగూలీతో ప్రధాని మాట్లాడినట్టు పీఎంవో వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా గంగూలీ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించినట్టు పేర్కొన్నాయి. కాగా ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన గంగూలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించారు.

మరోవైపు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఉడ్‌ల్యాండ్ ఆసుపత్రి ఆదివారం విడుదల చేసిన తాజా బులెటిన్‌లో ఈ విషయాన్ని పేర్కొంది.

ఈ ఉదయం కూడా ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు. వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రాత్రి జ్వరం లాంటి లక్షణాలేవీ కనిపించలేదని, ప్రస్తుతం నిద్రపోతున్నారని తెలిపాయి.  

గంగూలీ నిన్న ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తున్న సమయంలో చాతీలా ఇబ్బందిగా ఉండడం, తలలో బరువుగా ఉండడం, వాంతులు కావడంతోపాటు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఉడ్ ల్యాండ్ ఆసుపత్రికి తరలించారు.

click me!