ఐదు నెలల తర్వాత మళ్లీ కెప్టెన్ గా కేన్ మామ... ఇంగ్లాండ్ తో ఢీ కొనబోతున్న ప్రపంచ ఛాంపియన్లు

Published : May 04, 2022, 03:53 PM ISTUpdated : May 04, 2022, 04:02 PM IST
ఐదు నెలల తర్వాత మళ్లీ కెప్టెన్ గా కేన్ మామ... ఇంగ్లాండ్ తో ఢీ కొనబోతున్న ప్రపంచ ఛాంపియన్లు

సారాంశం

ENG vs NZ Test Series: గతేడాది భారత్ తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్ లో గాయపడిన  న్యూజిలాండ్  సారథి కేన్ విలియమ్సన్ తిరిగి  తన జట్టుతో చేరాడు. త్వరలో ఇంగ్లాండ్ తో జరుగబోయే  సిరీస్ లో అతడు బరిలోకి దిగబోతున్నాడు. 

గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం మూడు రోజులకే భారత పర్యటనకు వచ్చి టీ20, టెస్టు సిరీస్ ఆడిన న్యూజిలాండ్.. రెండింటిలోనూ ఓటమి పాలైంది. టీ20 సిరీస్ కు దూరంగా ఉన్న కేన్ విలియమ్సన్..   కాన్పూర్ లో ముగిసిన తొలి టెస్టు లో మాత్రమే ఆడాడు.  గాయం కారణంగా  ముంబైలో ముగిసిన రెండో టెస్టులో ఆడలేకపోయాడు. అప్పట్నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న కేన్ మామ.. ఇటీవల మొదలైన  ఐపీఎల్  లో మళ్లీ ఆడతున్నాడు.  పూర్తి ఫిట్నెస్ సాధించడంతో   విలియమ్సన్.. త్వరలో తిరిగి జాతీయ జట్టు తరఫున  సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. 

సుమారు ఐదు నెలల తర్వాత  తిరిగి తన జాతీయ జట్టుతో కలవనున్న విలియమ్సన్.. ఇంగ్లాండ్ తో జూన్ 2 నుంచి  ఇంగ్లీష్ గడ్డ మీద జరుగబోయే మూడు మ్యాచులు టెస్టు సిరీస్ కు  అందుబాటులో రానున్నాడు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.. కేన్ విలిమయ్సన్ తో కూడిన 20 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ల హోదాలో కివీస్ జట్టు ఇంగ్లాండ్ ను ఢీకొనబోతున్నది. 

న్యూజిలాండ్ ప్రకటించిన జట్టులో విలియమ్సన్ తో పాటు దేశవాళీ టోర్నీలలో అదరగొడుతున్న మైఖేల్ బ్రేస్వెల్, వికెట్ కీపర్ క్యామ్ ఫ్లెచర్, ఓపెనర్ హమీష్  రూథర్ఫోర్డ్, పేసర్లు జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్ కు జట్టులో చోటు దక్కింది.  

భారత్ తో  టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత గాయంతో కేన్ మామ స్వదేశంలో బంగ్లాదేశ్,  దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్ లలో ఆడలేకపోయాడు.  ఈ రెండింటిలో న్యూజిలాండ్.. సిరీస్ లను సమం చేసింది. అయితే మోచేతి గాయం కావడం.. రాబోయే రోజుల్లో కీలక సిరీస్ ల నేపథ్యంలో  విలియమ్సన్  నాలుగు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడని, అతడు ఇప్పుడు ఫిట్ గా ఉండటంతోనే తిరిగి జాతీయ జట్టుకు ఎంపిక చేశామని ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. 

 

ఇదిలాఉండగా.. గతేడాది ఇంగ్లాండ్ లోనే జరిగిన టెస్టు సిరీస్ లో తమను ఓడించిన న్యూజిలాండ్ పై ప్రతాపం తీర్చుకోవాలని  ఇంగ్లీష్ జట్టు భావిస్తున్నది.  ఈ సిరీస్ నుంచే ఆ జట్టు కొత్త సారథి బెన్ స్టోక్స్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.  కొత్త హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టెన్ కూడా ఈ సిరీస్ తో  ఇంగ్లాండ్ తో కలవనున్నాడు. కానీ జూన్ 2 నుంచి మొదలయ్యే తొలి టెస్టుకు కాకుండా.. జూన్ 10 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు గ్యారీ  ఇంగ్లాండ్ తో కలుస్తాడు. 

ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు న్యూజిలాండ్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్ (కెప్టెన్‌), టామ్ బ్లండెల్ (వికెట్‌ కీపర్‌), ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్వెల్, డెవాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, జాకబ్ డఫీ, కామెరాన్ ఫ్లెచర్, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్‌, రచిన్‌ రవీంద్ర, హమీష్ రూథర్‌ఫోర్డ్, టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, విల్ యంగ్

PREV
click me!

Recommended Stories

KKR : రూ. 25 కోట్లు పెట్టినా తగ్గేదేలే.. కోల్‌కతా నైట్ రైడర్స్ పక్కా మాస్టర్ ప్లాన్.. !
IPL : ఆర్సీబీ అభిమానులకు పండగే ! 40 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ టీమ్ ప్లేయర్ !