ఐయామ్ బ్యాక్ అన్న బుమ్రా... టీజ్ చేసిన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్

By telugu teamFirst Published Nov 1, 2019, 9:26 AM IST
Highlights

త్వరలోనే తాను మళ్లీ మైదానంలోకి వచ్చేస్తాను అంటూ ఇటీవల బుమ్రా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టాడు.  జిమ్ లో కసరత్తులు చేస్తూ... తీసుకున్న సెల్ఫీని కూడా సోషల్ మీడియాలో పెట్టాడు. కాగా... ఆ ఫోటోకి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వ్యాట్ స్పందించింది.

టీమిండియా యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా ని ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ టీజ్ చేస్తోంది. వెన్ను నొప్పితో  బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఇప్పుడిప్పుడే బుమ్రా వెన్నుగాయం నుంచి కోలుకుంటున్నాడు. జిమ్ లో మెల్లమెల్లగా కసరత్తులు ప్రారంభించాడు.

త్వరలోనే తాను మళ్లీ మైదానంలోకి వచ్చేస్తాను అంటూ ఇటీవల బుమ్రా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టాడు.  జిమ్ లో కసరత్తులు చేస్తూ... తీసుకున్న సెల్ఫీని కూడా సోషల్ మీడియాలో పెట్టాడు. కాగా... ఆ ఫోటోకి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వ్యాట్ స్పందించింది.

‘బేబీ వెయిట్స్’( చిన్నపిల్లలు ఎత్తగల తక్కువ బరువు ఉన్నవి) అంటూ కామెంట్స్ చేసింది. తక్కువ బరువులు ఎత్తుతున్నావు అనే అర్థం వచ్చేలా కామెంట్ చేసి టీజ్ చేసింది. ఎందుకంటే గాయం నుంచి కోలుకుంటున్న అతను ప్రస్తుతం తక్కువ వెయిట్స్ తో కసరత్తులు చేస్తున్నాడు.

AlsoRead మీరు ఫేమస్ అవ్వడానికి నా పేరు లాగొద్దు... ఫరూక్ పై అనుష్క శర్మ ఫైర్

గతంలో తనను పెళ్లి చేసుకోవాలని కోహ్లీని కోరింది  కూడా ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ వ్యాట్ కావడం గనమార్హం. కాగా... కొంతకాలం క్రితం బుమ్రా వెన్నునొప్పితో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. 

ఇంగ్లాండ్ రాజధాని లండన్ లోని నిపుణుల పర్యవేక్షణలో బుమ్రాకు వైద్యం అందించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఈ మేరకు అతన్ని లండన్ కు పంపించినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. 

'' తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రాను వైద్య పరీక్షల నిమిత్తం లండన్ కు పంపాలని నిర్ణయించాం. మరో రెండు లేదా మూడు రోజుల్లో బుమ్రా, ఎన్సీఏ చీఫ్ ఫిజియో ఆశిస్ కౌశిక్ లు అక్కడికి వెళ్లనున్నారు. నిపుణుల సమక్షంలో వైద్య పరీక్షలు జరిపించి గాయం తగ్గుముఖం పట్టేవరకు వీరిద్దరు అక్కడే వుండనున్నారు. ప్రస్తుతాకయితే బుమ్రాను ఏన్సీఏలోని ముగ్గురు నిపుణుల బృందం వేర్వేర్వుగా పర్యవేక్షిస్తోంది. అయినప్పటికి గాయంపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. లండన్ లో చికిత్స అనంతరమే ఈ గాయంపై ఓ క్లారిటీరానుంది.'' అని సదరు అధికారి తెలిపారు.  

విశాఖపట్నంలో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ కి కూడా  బుమ్రా గాయం కారణంగానే దూరమయ్యాడు. ప్రస్తుతం అతడి గాయం తీవ్రత తగ్గట్లేదు కాబట్టి నవంబర్ లో బంగ్లాదేశ్ తో జరగనున్న సీరిస్ కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇలా స్వదేశంలో జరుగుతున్న ఈ సీరిస్ లకు బుమ్రా దూరమవడంతో టీమిండియాపై ప్రభావం పడనుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Coming soon! 💪🏼

A post shared by jasprit bumrah (@jaspritb1) on Oct 29, 2019 at 12:15am PDT

 

click me!