
ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ గొప్పదని బడాయి పోయే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి దిమ్మతిరిగే న్యూస్ ఇది. కాంట్రాక్ట్ ప్రకారం ఒప్పందం కుదుర్చుకున్న డబ్బులు ఇవ్వడం లేదని పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్...
ఐపీఎల్ మాదిరిగా కాకుండా పాక్ సూపర్ లీగ్‌లో ప్లేయర్లకు నిర్ధిష్టమైన ధర ఉంటుంది. ప్లాటినం కేటగిరి, డైమండ్ కేటగిరి అంటూ ఒక్కో సెట్ ప్లేయర్లకు ఒక్కో ధర డిసైడ్ చేస్తారు. ప్లాటినం గ్రూప్‌లో ఉన్న ప్లేయర్లు అత్యధికంగా రూ.2.3 కోట్లు (పాకిస్తాన్ రూపాయల్లో) దక్కించుకుంటారు.
డైమండ్ గ్రూప్‌లో ఉన్న ప్లేయర్లకు సీజన్‌కి రూ.1.15 కోట్లు (పాకిస్తాన్ రూపాయల్లో) సొంతం చేసుకుంటారు. షాదబ్ ఖాన్, మహ్మద్ అమీర్, మహ్మద్ నబీ, హరీస్ రౌఫ్, మహ్మద్ హఫీజ్, ఇమ్రన్ తాహీర్‌లతో పాటు జేమ్స్ ఫాల్కనర్ కూడా డైమండ్ కేటగిరీ ప్లేయర్లే...
పీఎస్ఎల్ 2022 సీజన్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకి ఎంపికయ్యాడు జేమ్స్ ఫాల్కనర్. అయితే సీజన్‌లో ఇంకా రెండు మ్యాచులు ఉన్నప్పటికీ, కాంట్రాక్ట్ ప్రకారం అతనికి ఇవ్వాల్సిన మొత్తం ఇప్పటిదాకా చెల్లించలేదట పాక్ క్రికెట్ బోర్డు...
దీంతో మనస్థాపం చెందిన జేమ్స్ ఫాల్కనర్, పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్ 2022) సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ‘పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి నేను క్షమాపణలు కోరుతున్నా. కానీ నేను పాక్ సూపర్ లీగ్ ఆఖరి రెండు మ్యాచుల నుంచి తప్పుకోవాల్సింది వస్తోంది. నేను సీజన్ మొత్తం ఇక్కడే ఉన్నాను, కానీ వాళ్లు ఇప్పుడిస్తాం? అప్పుడిస్తాం అని అబద్దాలు చెబుతూనే ఉన్నారు...
పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభమవ్వడానికి నా వంతు సాయం చేయాలని భావించిన నాకు ఈ సంఘటన బాధను కలిగించింది. పాకిస్తాన్‌లో ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ క్రికెటర్లు ఉన్నారు, ఫ్యాన్స్ అయితే అమేజింగ్... అయితే పాక్ క్రికెట్ బోర్డు, పీఎస్‌ఎల్ నాతో ప్రవర్తించిన తీరు, బాధను కలిగించింది... నా పరిస్థితిని మీరంతా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్...
జేమ్స్ ఫాల్కనర్ ట్వీట్‌పై పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజాను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్. వెంటనే ఈ ఇష్యూని క్లియర్ చేసి పాకిస్తాన్ పరువు కాపాడాలని కోరుతున్నారు. కోటిన్నర కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ టోర్నీ ఐపీఎల్‌ను చులకనగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ పాక్ ఫ్యాన్స్‌ను ట్రోల్స్ చేస్తున్నారు భారత అభిమానులు..
2015 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ ఆస్ట్రేలియా టీమ్‌లో సభ్యుడైన జేమ్స్ ఫాల్కనర్, ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఫేనే వారియర్స్ ఇండియా, గుజరాత్ లయన్స్, రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడాడు. అయితే 2017 తర్వాత ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని జేమ్స్ ఫాల్కనర్, ఆస్ట్రేలియా తరుపున ఓ టెస్టు మ్యాచ్‌తో పాటు 69 వన్డేలు ఆడాడు...