సూర్యను కాపాడాలని చూస్తే అదే అతడిని నాశనం చేస్తుంది: మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Mar 25, 2023, 11:43 AM IST
సూర్యను కాపాడాలని చూస్తే అదే  అతడిని నాశనం చేస్తుంది: మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

సారాంశం

Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ లలోనూ డకౌట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ పై తాజాగా  మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

టీ20లలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్.. వన్డేలలో మాత్రం దారుణ వైఫల్యాలతో  తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. ముఖ్యంగా ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్ లో మూడు మ్యాచ్ లకు గాను మూడింటిలో డకౌట్ అవడంతో  సూర్య కెరీర్ ముగిసినట్టేనని వాదనలూ (వన్డేలలో) వినిపిస్తున్నాయి. అయితే పలువురు మాజీ క్రికెటర్లు మాత్రం  సూర్యకు మద్దతుగా నిలుస్తున్నారు.  తాజాగా భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా సూర్యకు మద్దతుగా నిలిచాడు.  

క్రిక్ బజ్ లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న  జడేజా  మాట్లాడుతూ.. ‘కొద్దిరోజుల క్రితం  టీ20 క్రికెట్ లో గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతూ బౌలర్లను దంచేసిన సూర్యకుమార్ ‌నే ఇప్పుడూ మనం చూస్తున్నాం.  అతడికి  క్రికెట్ ఎలా ఆడాలనేది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు... 

ఇదంతా  మైండ్ సెట్ కు  సంబంధించిన విషయం.  కొద్దిరోజుల క్రితం విరాట్ కోహ్లీ కూడా అత్యంత చెత్త ఫామ్ తో సతమతమయ్యాడు.   నేను చెప్పేది ఏంటంటే.. మీ ఆటపై ప్రభావం చూపే అంశాలు   చాలా ఉంటాయి.   ఒక ఆటగాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ.. అతడిని బ్యాటింగ్ చేయడానికి వేచి ఉంచేలా చేస్తే అది అతడిలో సమర్థతను దెబ్బతీస్తుంది.   మా రోజుల్లో  ఎవరైనా ఫామ్ లో లేకుంటే   నాలుగో స్థానంలో ఆడే బ్యాటర్ ను ఏడో స్థానంలో పంపితే అది మరింత సవాల్ గా ఉండేది.  ఎల్లప్పుడూ  బ్యాటింగ్ చేసే పొజిషన్ లోనే  ఆటగాళ్లు చాలా సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు.   అలా కాకుండా లోయరార్డర్ కు పంపితే అది సదరు ఆటగాళ్లలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.  తద్వారా ఆటగాళ్లు ఫామ్ ను తిరిగి పొందడం పక్కనబెడితే   అది  వారి  ఆటలో 60-80 శాతాన్ని  కోల్పోయేలా చేస్తుంది.  మీరు ఎవరినైనా రక్షించాలని చూస్తే  ఈ గేమ్ మిమ్మల్ని మరింత   నాశనం చేస్తుంది..’అని  చెప్పాడు. 

ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన  సూర్య.. ఎదుర్కున్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో చెన్నై వన్డేలో టీమ్ మేనేజ్మెంట్ అతడిని ఏడో స్థానంలో బ్యాటింగ్ కు పంపింది. ఏడో  స్థానంలో వచ్చినా  సూర్య   డకౌట్ గానే  వెనుదిరిగాడు.   ఈ విషయంలో  రోహిత్ శర్మ కూడా  మూడో వన్డే తర్వాత ఇదేవిషయాన్ని చెప్పిన విషయం తెలిసిందే.  మ్యాచ్  చివరి 15 ఓవర్లలో  సూర్యను బరిలోకి దింపితే అతడి మెరుపులతో  భారత్ లక్ష్యాన్ని ఛేదిస్తుందని భావించామని, కానీ అతడు  డకౌట్ అవడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని  రోహిత్ చెప్పాడు. 

ఈ విషయంలో కపిల్ దేవ్ కూడా  కెప్టెన్ నిర్ణయాన్ని సమర్థించాడు. అతడు ఫినిషర్ పాత్ర పోషించాలని టీమ్ భావించినప్పుడు అలా  చేయడంలో తప్పులేదని అన్నాడు.  ఇదేం కొత్త కాదని,  గతంలో చాలాసార్లు, చాలా మంది ఆటగాళ్లు జట్టు అవసరాల కోసం ఇలా చేశారని  చెప్పుకొచ్చాడు. సూర్యకు యువరాజ్ సింగ్ కూడా మద్దతు ప్రకటించాడు. ప్రస్తుతం విఫలమవుతున్న సూర్య.. త్వరలోనే తిరిగి ఫామ్ ను అందుకుంటాడని, వన్డే వరల్డ్ కప్ లో అతడే కీలకమని ట్వీట్ చేశాడు. 
 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !