పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన ఆఫ్ఘాన్... పసికూన చేతుల్లో చిత్తుగా ఓడిన దాయాది...

Published : Mar 25, 2023, 09:41 AM IST
పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన ఆఫ్ఘాన్... పసికూన చేతుల్లో చిత్తుగా ఓడిన దాయాది...

సారాంశం

మొదటి టీ20లో ఆఫ్ఘాన్ చేతుల్లో 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్తాన్... ఎట్టకేలకు పాకిస్తాన్‌పై విజయాన్ని అందుకున్న ఆఫ్ఘనిస్తాన్.. 

పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిన్న పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌ ‘ది హాండ్రెడ్’ లీగ్‌లో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరగా తాజాగా పసికూన ఆఫ్ఘాన్ చేతుల్లో పరాజయం పాలైంది పాకిస్తాన్. ఓడడం అంటే అలా ఇలా కూడా కాదు... కనీస పోరాటం కూడా లేకుండా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండ్ విభాగాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది...

ఇప్పటిదాకా పాకిస్తాన్‌తో 4 వన్డేలు, 3 టీ20 మ్యాచులు ఆడినా విజయం దాకా వచ్చి ఓడిపోతూ వస్తున్న ఆఫ్ఘానిస్తాన్‌కి ఇది తొలి విజయం. 

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 92 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. సయిం అయూబ్ 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌ో 17 పరుగులు చేయగా మహ్మద్ హారీస్ 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేశాడు...

అబ్దుల్లా సఫీక్, వికెట్ కీపర్ ఆజమ్ ఖాన్ డకౌట్ కాగా తయ్యబ్ తహీర్ 9 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇమాద్ వసీం 32 బంతులు ఆడినా ఒక్క బౌండరీ కూడా కొట్టలేక 18 పరుగులు చేశాడు..

ఫహీం ఆఫ్రఫ్ 2, నసీం షా 2, జమామ్ ఖాన్ 8, ఇన్షానుల్లా 6 పరుగులు చేశారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫజల్‌హక్ ఫరూకీ, ముజీబ్ వుర్ రహీమ్, మహ్మద్ నబీ రెండేసి వికెట్లు తీశారు. ఆఫ్ఘాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ ఓ వికెట్ తీయగా అజ్మతుల్లా, నవీన్ ఉల్ హక్‌లకే చెరో వికెట్ దక్కాయి..

ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించి పడేసింది ఆఫ్ఘాన్. గుల్బాద్దీన్ నైబ్ డకౌట్ అయినా రహ్మనుల్లా గుర్భాజ్ 17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేశాడు. ఇబ్రహీం జార్డాన్ 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేయగా కరీం జనత్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మహ్మద్ నబీ 38 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేయగా నజీబుల్లా జార్డాన్ 23 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేశాడు..

ఈ సిరీస్‌లో రెండో టీ20 ఆదివారం, మార్చి 26న, ఆఖరి టీ20 మ్యాచ్ సోమవారం మార్చి 27న జరగబోతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !