అతడు మనిషి కాదు గ్రహంతరవాసి.. ఆ విషయంలో ఇస్రో ఇన్వెస్టిగేట్ చేయాలి.. మిస్టర్ 360పై ట్విటర్‌లో..

Published : Jan 08, 2023, 02:39 PM IST
అతడు మనిషి కాదు గ్రహంతరవాసి.. ఆ విషయంలో ఇస్రో ఇన్వెస్టిగేట్ చేయాలి..  మిస్టర్ 360పై ట్విటర్‌లో..

సారాంశం

INDvsSL: మూడో మ్యాచ్ లో 26 బంతులలోనే హాఫ్ సెంచరీ చేసిన  సూర్య.. ఆ తర్వాత  19 బంతుల్లోనే మిగతా యాభై పరుగులను పూర్తి చేశాడు.  అతడి ఇన్నింగ్స్ లో  7 ఫోర్లు, 9  భారీ సిక్సర్లున్నాయి. టీ20లలో సూర్యకు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 

గత ఏడాదిన్నర కాలంగా  భారత టీ20 జట్టు విజయాలలో కీలకంగా మారాడు సూర్యకుమార్ యాదవ్. ప్రత్యర్థి ఎవరు అన్నదానితో సంబంధం లేకుండా  వీరబాదుడు బాదుతున్న  సూర్య ఆటతీరు నానాటికీ  మెరుగవుతూనే ఉందే తప్ప తగ్గడం లేదు.  ఈ నయా మిస్టర్ 360 క్రీజులో ఉంటే  స్కోరు బోర్డు పరుగులు తీయడం తప్ప మరో ఆప్షన్  లేదు.  స్వదేశంలో శ్రీలంకతో ముగిసిన  మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో  భాగంగా రెండో టీ20తో  పాటు   రాజ్‌కోట్ లో కూడా  వీరవిహారం చేశాడు.  మూడో మ్యాచ్ లో 26 బంతులలోనే హాఫ్ సెంచరీ చేసిన  సూర్య.. ఆ తర్వాత  19 బంతుల్లోనే మిగతా యాభై పరుగులను పూర్తి చేశాడు.  అతడి ఇన్నింగ్స్ లో  7 ఫోర్లు, 9  భారీ సిక్సర్లున్నాయి. టీ20లలో సూర్యకు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. 

సూర్య బ్యాటింగ్ విధ్వంసాల తర్వాత ట్విటర్ హోరెత్తింది.  లంక బౌలర్లు, ఫీల్డర్లను నిశ్చేష్టులను చేస్తూ  అతడు ఆడిన ఇన్నింగ్స్ పై ట్విటర్ లో  మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.  అసలు సూర్య ఆట చూసిన తర్వాత అతడు మనిషి కాదని గ్రహంతరవాసి అని.. ఇలా ఆడటం మనుషులెవరికీ సాధ్యం కాదని  కామెంట్స్ చేస్తున్నారు. 

శ్రీలంకతో మూడో మ్యాచ్ లో సూర్య సెంచరీ తర్వాత  ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘నాకు తెలిసి సూర్యకుమార్ యాదవ్ మనిషి కాదు.  అతడు ఏలియన్.  మనుషులెవరూ ఇలాంటి క్రికెట్ ఆడలేరు. సూర్య మనిషో కాదో ఇస్రో విచారణ చేయాలి...’అని ట్వీట్ చేశాడు.  మరికొందరు అతడి ఆటను ‘మోన్‌స్టర్’గా అభివర్ణించారు.  

విండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్  స్పందిస్తూ.. ‘ఒకవేళ సూర్య ఆరేండ్ల క్రితమే భారత జట్టులోకి వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోండి.. ఇప్పుడు ఆడుతున్నట్టే ఆడేవాడా? లేక 30ల్లో అరంగ్రేటం చేయడం వల్ల ఇలా ఆడగలుగుతున్నాడా?’ అంటూ ట్వీట్ చేశాడు.  ప్రముఖ క్రికెట్ కామెంటేటర్  హర్షా భోగ్లే స్పందిస్తూ..‘చాలా మంది తాము కలగన్నట్టు ఆడలేరు..’ అని  ట్వీట్ చేశాడు. సూర్యమాత్రం అందుకు  బిన్నంగా తనకు నచ్చినట్టు ఆడుతున్నాడు అని అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశాడు. 

 

మ్యాచ్ విషయానికొస్తే..  రాజ్‌కోట్ వేదికగా ముగిసిన మూడో మ్యాచ్ లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి  నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.   తర్వాత   లక్ష్య ఛేదనలో శ్రీలంక.. 137 పరుగులకే ఆలౌట్ అయింది.  ఫలితంగా భారత్.. 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

 

 

 

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !