మూడో టెస్టు డ్రా.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఆసీస్ దూకుడు.. సఫారీలకు భారీ షాక్.. మెరుగవుతున్న భారత్ ఛాన్స్‌లు

Published : Jan 08, 2023, 01:21 PM IST
మూడో టెస్టు డ్రా.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఆసీస్ దూకుడు.. సఫారీలకు భారీ షాక్.. మెరుగవుతున్న భారత్ ఛాన్స్‌లు

సారాంశం

WTC Final Race: స్వదేశంలో ఆస్ట్రేలియా దుమ్మురేపింది.  దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను 2-0తో  చేజిక్కించుకుంది.  మూడో టెస్టులో ఫలితం తేలనప్పటికీ సిరీస్ ను గెలుచుకుని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రేసులో ముందంజలో ఉంది. 

ఆస్ట్రేలియా పర్యటనలో దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం.   తొలి రెండు టెస్టులను ఓడిన సఫారీలు.. సిడ్నీ వేదికగా ముగిసిన మూడో టెస్టులో  డ్రాతో సరిపెట్టుకున్నారు. ఫాలో ఆన్ ఆడుతూ  రెండో ఇన్నింగ్స్ లో  2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేశారు. ఫలితంగా మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆస్ట్రేలియా 2-0తో గెలుచుకుంది.  అంతేగాక డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. సిరీస్ ఓటమితో దక్షిణాఫ్రికా ఫైనల్ అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతుండగా భారత్ కు మాత్రం మెరుగుపడుతున్నాయి.  

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా తొలుత  బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది.  మూడు రోజుల పాటు  వెలుతురు లేమి, వర్షం కారణంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగియలేదు. నాలుగో రోజు ఆ జట్టు డిక్లేర్ చేసి విజయం మీద కన్నేసింది.  అందుకు అనుగుణంగానే తొలి ఇన్నింగ్స్ లో సఫారీలను 255 పరుగులకే ఆలౌట్ చేసింది. 

ఫాలో ఆన్ గండంలో పడ్డ దక్షిణాఫ్రికా.. రెండో ఇన్నింగ్స్  ప్రారంభించింది.  కెప్టెన్ డీన్ ఎల్గర్ (10) త్వరగానే నిష్క్రమించాడు. హెన్రిచ్ క్లాసెన్ (35) ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్ సరెల్ ఎర్వీ (42 నాటౌట్), టెంబ బవుమా (17) లు నాటౌట్ గా నిలిచారు. 

 

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు ఇది.. 

- ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో  టాప్ -5 ఉన్న జట్లుగా ఆస్ట్రేలియా (75.56%), ఇండియా (58.93), శ్రీలంక (53.33), సౌతాఫ్రికా (48.72), ఇంగ్లాండ్ (46.97) ఉన్నాయి.  ఆస్ట్రేలియాతో దారుణ ఓటమి నేపథ్యంలో ఈ సిరీస్ కు ముందు వరకూ రెండో స్థానంలో ఉన్న దక్షిణిఫ్రికా ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది.  భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. 

- దక్షిణాఫ్రికాతో సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా ఫైనల్ రేసును  ఖాయం  చేసుకుంది. త్వరలో భారత్ తో జరుగబోయే సిరీస్ లో ఆ జట్టు ఓడినా పెద్ద నష్టమేమీ ఉండదు.

- ఇక తాజాగా ఆసీస్-సఫారీ సిరీస్ లో దక్షిణాఫ్రికా ఓడటంతో  వచ్చే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత్ పని మరింత సులువైంది.    ఆసీస్ ను 4-0తో ఓడిస్తే భారత్ కు తిరుగుండదు.   3-1 తో గానీ, 2-0తో గానీ నెగ్గినా  ఫైనల్ కు క్వాలిఫై అవొచ్చు. ఓడితే మాత్రం   సమీకరణాలు మారతాయి. 

- దక్షిణాఫ్రికా విషయానికొస్తే ఆ జట్టు వెస్టిండీస్ తో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఆ సిరీస్ ను  క్లీన్ స్వీప్ చేసి భారత్ ఆసీస్ చేతిలో ఓడితే  అప్పుడు ఆ జట్టుకు అవకాశాలుంటాయి.  అలా కాకుండా భారత్ సిరీస్ నెగ్గితే దక్షిణాఫ్రికా పని గోవిందా.. 

- శ్రీలంక.. న్యూజిలాండ్ తో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ ను 2-0తో నెగ్గితే  లంకకు కూడా ఫైనల్ రేసులో అవకాశముంటుంది.  అయితే ఇది ఇతర జట్ల ఫలితాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇవి కాకుండా ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ లకు  ఫైనల్ రేసులో నుంచి ఎప్పుడో తప్పుకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Team India : గిల్ కోసం బలిపశువుగా మారిన స్టార్ ! గంభీర్, అగార్కర్ ఏందయ్యా ఇది !
Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !