ఇషాన్ కిషన్ ‘డబుల్’ బాదుడు! విరాట్ కోహ్లీ క్లాస్ సెంచరీ... బంగ్లాదేశ్ ముందు కొండంత లక్ష్యం...

Published : Dec 10, 2022, 03:32 PM ISTUpdated : Dec 10, 2022, 04:53 PM IST
ఇషాన్ కిషన్ ‘డబుల్’ బాదుడు! విరాట్ కోహ్లీ క్లాస్ సెంచరీ... బంగ్లాదేశ్ ముందు కొండంత లక్ష్యం...

సారాంశం

210 పరుగులతో వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్... కెరీర్‌లో 72వ అంతర్జాతీయ శతకాన్ని అందుకున్న విరాట్ కోహ్లీ... మూడో వన్డేలో బంగ్లాదేశ్ ముందు 410 పరుగుల భారీ లక్ష్యం... 

బంగ్లాదేశ్ టూర్‌లో తొలి రెండు వన్డేల్లో ఓడిన తర్వాత టీమిండియా గాడిలో పడినట్టు కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత తుదిజట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో రికార్డు క్రియేట్ చేయగా విరాట్ కోహ్లీ 72వ అంతర్జాతీయ శతకంతో చెలరేగాడు. ఈ ఇద్దరికి తోడు మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్లు కూడా బ్యాటు ఝులిపించడంతో మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 409 పరుగుల భారీ స్కోరు చేసింది...

8 బంతులాడిన శిఖర్ ధావన్, 3 పరుగులు మాత్రమే చేసి మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. 85 బంతుల్లో సెంచరీ అందుకున్న ఇషాన్ కిషన్, 102 బంతుల్లో 150+ స్కోరు నమోదు చేశాడు. 126 బంతుల్లో డబుల్ సెంచరీ మార్కు అందుకుని.. అత్యంత వేగంగా వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

రెండో వికెట్‌కి ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ కలిసి 290 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి లిటన్ దాస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఇషాన్ కిషన్ అవుటైన తర్వాత సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్నాడు విరాట్ కోహ్లీ. మూడేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 113 పరుగులు చేసి షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర మెహిదీ హసన్ మిరాజ్‌కి క్యాచ్ ఇచ్చాడు...

శ్రేయాస్ అయ్యర్ 6 బంతుల్లో 3 పరుగులు చేసి అవుట్ కాగా 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఎబదట్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఆరో వికెట్‌కి 46 పరుగులు జోడించారు. 17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన అక్షర్ పటేల్, టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా 27 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్... షకీబ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...

శార్దూల్ ఠాకూర్ 3 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. ఆఖరి 10 ఓవర్లలో కేవలం 70 పరుగులు మాత్రమే వచ్చాయి.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !