ఇషాన్ కిషన్ తుత్తర, విరాట్ కోహ్లీ ఆత్రం.. పాకిస్తాన్ టీమ్‌ తరహాలో రనౌట్ క్రియేట్ చేసిన టీమిండియా...

By Chinthakindhi RamuFirst Published Jan 24, 2023, 4:45 PM IST
Highlights

17 పరుగులు చేసి రనైట్ అయిన ఇషాన్ కిషన్... ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యం తర్వాత కూడా 400+ మార్కు చేరలేకపోయిన భారత జట్టు.. 

రనౌట్ల విషయంలో పాకిస్తాన్‌కి ఓ సెపరేట్ స్టైల్ ఉంటుంది. ప్రతీ టీమ్‌లో రనౌట్లు సహాజం. అయితే ఇద్దరు బ్యాటర్లు ఒకేవైపు పరుగెత్తుతూ వికెట్ పారేసుకోవడం మాత్రం పాకిస్తాన్‌ టీమ్‌లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇషాన్ కిషన్ తుత్తర పాటు పుణ్యామాని, న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఇలాంటి సీన్.. టీమిండియాలో క్రియేట్ అయ్యింది...

ఓపెనర్‌గా డబుల్ సెంచరీ సాధించిన తర్వాత కూడా టీమ్ కాంబినేషన్‌ కారణంగా ఇషాన్ కిషన్‌ని మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తోంది భారత జట్టు. ఓపెనర్‌గా ఆడినప్పుడే ఎప్పుడో కానీ బాగా ఆడని ఇషాన్ కిషన్, మిడిల్ ఆర్డర్‌లో సెటిల్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నాడు. 

ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగడంతో 26 ఓవర్లకే 212 పరుగులు చేసింది భారత జట్టు. 78 బంతుల్లో 112 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ అవుటైన తర్వాత నాలుగో స్థానంలో క్రీజులోకి అడుగుపెట్టాడు ఇషాన్ కిషన్..

ఆరు బంతులు డిఫెన్స్ ఆడిన తర్వాత సింగిల్‌తో ఖాతా తెరిచిన ఇషాన్ కిషన్, 15 బంతుల తర్వాత బౌండరీ బాదాడు. 24 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.

జాకబ్ డఫ్పీ బౌలింగ్‌లో మూడో బంతికి కవర్స్ వైపు షాట్ ఆడిన ఇషాన్ కిషన్, సింగిల్ తీసేందుకు పిలుపు నిచ్చాడు. వికెట్ల మధ్య మెరుపు వేగంతో పరుగెత్తే విరాట్ కోహ్లీ, బంతి ఎటు వెళ్లిందో కూడా గమనించకుండా సింగిల్ కోసం పరుగెత్తాడు..

అయితే సగం క్రీజు దాటిన తర్వాత అవుట్ అవుతానని గ్రహించిన ఇషాన్ కిషన్, వెనక్కి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించాడు. నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో విరాట్ కోహ్లీ ఉండడంతో వెనక్కి వెళ్లాలా? వద్దా? అనే అయోమయానికి గురైనట్టు కనిపించిన ఇషాన్ కిషన్... కోహ్లీ క్రీజులోకి వచ్చిన తర్వాత బ్యాటు పెట్టాడు... ఇద్దరూ ఒకే వైపు పరుగెత్తడం కనిపించింది...

బంతిని అందుకున్న డఫ్పీ, నాన్ స్ట్రైయికర్ ఎండ్‌లో వికెట్లను గిరాటేయడంతో లేటుగా క్రీజు దాటిన ఇషాన్ కిషన్ అవుట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. పెవిలియన్‌కి వెళ్లే సమయంలో ఇషాన్ కిషన్‌ని, విరాట్ కోహ్లీని ఏదో అనడం కూడా కెమెరాల్లో కనిపించింది..

ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చే సమయానికి ఇంకా 22 ఓవర్లకు పైగా ఆట మిగిలే ఉంది. కాస్త కుదురుకుంటే సెంచరీలు చేయడం, ఓ భారీ ఇన్నింగ్స్ ఆడడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే అనవసరంగా తొందరపడి వికెట్ పారేసుకున్నాడు ఇషాన్ కిషన్...

ఇషాన్ కిషన్ అవుటైన కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వికెట్లను కూడా కోల్పోయింది టీమిండియా. ఒకానొక దశలో ఓపెనర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈజీగా 400+ చేసేలా కనిపించింది భారత జట్టు. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ కావడంతో భారీ స్కోరు చేయడంలో తడబడింది..

click me!