విరాట్ కోహ్లీ కూడా మన మెగాస్టార్ అభిమానే.. ఇదిగో సాక్ష్యం.. నిక్ నేమ్ ‘చిరు’నే..

Published : Jul 13, 2022, 12:27 PM IST
విరాట్ కోహ్లీ కూడా మన మెగాస్టార్ అభిమానే.. ఇదిగో సాక్ష్యం.. నిక్  నేమ్ ‘చిరు’నే..

సారాంశం

Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి   నిక్ నేమ్స్ చాలానే ఉన్నాయి.  కానీ అతడిని చిన్నప్పుడు ‘చిరు’ అని పిలిచేవాళ్లట..  విరాట్ కూడా మన ఆంధ్రుల అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి అభిమానే.. 

గడిచిన దశాబ్దకాలంగా భారత క్రికెట్ పై చెరగని ముద్రవేస్తున్న మాజీసారథి విరాట్ కోహ్లీని  క్రికెటర్లతో పాటు కుటుంబసభ్యులు ‘చికూ’ అని పిలుస్తారు. ఇక అతడి అభిమానులు కోహ్లీకి ఇచ్చిన బిరుదులైతే లెక్కేలేదు.  ‘కింగ్ కోహ్లీ’, ‘గోట్ - గ్రేటెస్ట్  ఆఫ్ ఆల్ టైం’ అని పలు పేర్లతో పిలుస్తుంటారు. అయితే కోహ్లీకి మరో నిక్ నేమ్ కూడా ఉంది. అది మన తెలుగువాళ్లతో మూడు దశాబ్దాలుగా పెనవేసుకుపోయిన బందమైన  మెగాస్టార్ చిరంజీవి  పేరు. కోహ్లి నిక్ నేమ్ ‘చిరు’. అతడు మన మెగాస్టార్ కు అభిమాని. ఏం నమ్మట్లేదా..? కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయకున్నా ఇది చదివాకైనా మీకు తెలుస్తుంది విరాట్ కూడా ‘చిరు’ అభిమాని అని..

విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు.  ఈ క్రమంలో అతడిని తన మాజీ రూమ్ మేట్,  అండర్-15 ఆడే రోజుల్లో తనతో కలిసి ఆడిన తెలుగు క్రికెటర్ రవితేజ ఈ విషయాన్ని వెల్లడించాడు.  కోహ్లీ కూడా చిరంజీవి అభిమానే  అని.. మెగాస్టార్ పాటలకు  విరాట్ స్టెప్పులేసేవాడని  అతడు చెప్పాడు. ఈ నిజాలకు అతడి ట్వీట్ రాతలే సాక్ష్యం.. 

ట్విటర్ వేదికగా రవితేజ స్పందిస్తూ.. ‘‘ఆరు సంవత్సరాల తర్వాత  కోహ్లిని యూకేలో కలిశాను. కోహ్లిని కలవగానే అతడు  నాతో అన్నమాట..‘చిరు ఎలా ఉన్నావ్..?’ అని. అండర్-15 ఆడే రోజుల్లో మేమిద్దరం రూమ్ మేట్స్. ఆ క్రమంలో నేను రూమ్ లో టీవీ పెట్టుకుని  మెగాస్టార్ చిరంజీవి పాటలు వినుకుంటూ స్టెప్పులేసేవాడిని.  అది చూసిన కోహ్లి కూడా వచ్చి మెగాస్టార్ ను చూసుకుంటూ డాన్స్ చేసేవాడు. అప్పట్నుంచి మేమిద్దం మా నిక్ నేమ్స్ ను ‘చిరు’ అనిపెట్టుకున్నాం. నిన్నిలా చూడటం చాలా ఆనందంగా ఉంది చిరు..’ అని రాసుకొచ్చాడు. 

 

ఇంతకీ ఈ రవితేజ ఎవరనే గా మీ డౌటానుమానం. కాకినాడకు చెందిన ఈ తెలుగు క్రికెటర్.. రంజీలలో మేఘాలయ తరఫున ఆడుతున్నాడు. అండర్-15 రోజుల్లో  రవితేజ, కోహ్లీ ఒకే రూమ్ లో ఉండేవారు. ఈ కాకినాడ కుర్రోడికి మామూలుగానే చిన్నప్పట్నుంచే  చిరంజీవి ఫీవర్ అంటుకుంది. అప్పట్నుంచి  మెగాస్టార్ అంటే అభిమానం పెంచుకున్నాడు. ఆ క్రమంలో కోహ్లీతో కలిసిఉన్న రోజుల్లో  మెగాస్టార్ పాటలు పెట్టుకుని డాన్స్ చేసేవాడు. అలా కోహ్లీ కూడా ‘చిరు అభిమాని’ అయిపోయాడు. 

ప్రస్తుతం లండన్ లో ఉంటున్న రవితేజ.. కోహ్లీని కలిశాక ట్విటర్ లో ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. దీంతో నెట్టింట ఈ ట్వీట్ వైరల్ అవుతున్నది.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు