Rohit Sharma: హిట్ మ్యాన్ భారీ సిక్సర్.. చిన్నారికి గాయం..

Published : Jul 12, 2022, 10:04 PM ISTUpdated : Jul 12, 2022, 10:08 PM IST
Rohit Sharma: హిట్ మ్యాన్ భారీ సిక్సర్.. చిన్నారికి  గాయం..

సారాంశం

ENG vs IND: ఇంగ్లాండ్ తో జరుగుతున్నతొలి వన్డేలో టీమిండియా అదరగొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ చేస్తన్నప్పుడు రోహిత్ కొట్టిన ఓ సిక్సర్ వల్ల స్టేడియంలో ఉన్న చిన్నారికి గాయమైంది.

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ది ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో  టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నది. ఇంగ్లాండ్ ను 110 పరుగులకే ఆలౌట్ చేసిన భారత జట్టు.. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని సాఫీగా ఛేదించింది. ఈ క్రమంలో ఇండియా ఇన్నింగ్స్  ఐదో ఓవర్లో  డేవిడ్ విల్లీ వేసిన ఓ బంతిని పుల్ షాట్ ఆడాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. ఈ క్రమంలో ఆ బంతి స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ పాపకు బలంగా తాకింది. దాంతో ఆ పాప నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడింది. 

విల్లీ  వేసిన బంతిని పుల్  షాట్ ఆడిన రోహిత్ తర్వాత బంతిని ఎదుర్కోబోతుండగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ ఈ విషయాన్ని తన సహచరులకు చెప్పాడు. హిట్ మ్యాన్ దగ్గరికి బెయిర్ స్టో వచ్చి పాపకు గాయమైన  విషయాన్ని  తెలిపాడు. దాంతో ఆ పాప పట్ల రోహిత్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ  క్రమంలో కొద్దిసేపు మ్యచ్  ను ఆపారు. 

 

ఇంగ్లాండ్ ఫిజియోలు  ఆ పాప దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి ప్రథమ చికిత్స చేశారు.  ప్రస్తుతం ఆ పాప ఆరోగ్యం ఎలా ఉందనేదానిపై సమాచారం తెలియరాలేదు. అయితే ట్విటర్ లో మాత్రం ఓ అభిమాని.. ఆ పాప పేరు మీరా సాల్వి అని, ఆమె  ప్రస్తుతం బాగానే ఉందని ఫోటోతో పాటు పోస్ట్ చేయడం గమనార్హం. 

 

రోహిత్ - ధావన్ ల ఓపెనింగ్ రికార్డు : 

టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్-రోహిత్ శర్మ  ఈ మ్యాచ్ లో అరుదైన ఘనత సాధించారు. నేటి మ్యాచ్ లో వాళ్లు 6 పరుగులుపూర్తి కాగానే వన్డేలలో ఈ ఇద్దరి ఓపెనింగ్ భాగస్వామ్యం 5 వేల పరగులు దాటింది. వన్డే క్రికెట్ చరిత్రలో  ఐదు వేల పరుగులు చేసిన ఓపెనర్ల జాబితాలో ఈ జంట నాలుగోది కావడం గమనార్హం.  వీరి కంటే ముందు సచిన్-గంగూలీ (6,609) గిల్ క్రిస్ట్ - హెడెన్ (5,372), హేన్స్-గ్రీనిడ్జ్ (5,150) లు ఉన్నారు. ఆ తర్వాత జాబితాలో  ధావన్-రోహిత్ (5,110) లు నాలుగో స్థానంలో నిలిచారు.  ఇది ఈఇద్దరికీ 18వసెంచరీ భాగస్వామ్యం కావడం విశేషం.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !