బీసీసీఐ ప్రణాళికలు: దుబాయిలో ఐపీఎల్ 2020...?

By Sree sFirst Published Jun 5, 2020, 7:49 AM IST
Highlights

లాక్‌డౌన్‌ పరంపర కొనసాగుతుండడంతో.... ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదాపడుతూ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. భారత్‌లో ఇప్పుడు లాక్‌డౌన్‌ లడలింపులు కొనసాగుతున్నా... కరోనా మహమ్మారి మాత్రం విలయతాండవం చేస్తూనే ఉంది.  

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 విదేశాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలను రచిస్తున్నట్టు సమాచారం. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌ 13 సీజన్‌ తొలుత ఏప్రిల్‌ 15కు వాయిదా పడింది. 

లాక్‌డౌన్‌ పరంపర కొనసాగుతుండడంతో.... ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదాపడుతూ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. భారత్‌లో ఇప్పుడు లాక్‌డౌన్‌ లడలింపులు కొనసాగుతున్నా... కరోనా మహమ్మారి మాత్రం విలయతాండవం చేస్తూనే ఉంది.  

రోజుకు కేసులు వేళల్లో నమోదవుతున్నాయి. కోవిడ్‌-19 బాధితుల సంఖ్య రెండు లక్షలకు చేరింది. జులై ఆఖర్లో లేదా ఆగస్టు ఆరంభంలో క్రీడా పోటీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉంది. 

ఇప్పటివరకు ఐపీఎల్‌ భారత్‌లోనే నిర్వహిస్తారనే నమ్మకం బోర్డు వర్గాల్లో వినిపించింది. కానీ.... కరోనా వైరస్‌ కేసుల పెరుగుతుండడంతో, బీసీసీఐ విదేశీ ఆలోచనలు చేస్తోంది. బీసీసీఐ అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని, ఐపీఎల్‌ను భారత్‌లో కాకుండా విదేశాలకు తరలించాల్సి వస్తే దుబాయ్ లో నిర్వహిస్తారు అని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. 

అదొక్కటే మిగిలి ఉన్న మార్గం అనుకున్నప్పుడు, అదే చివరి అవకాశం అనుకున్నప్పుడు మాత్రమే ఆ పని చేస్తామని,ఆ పని బీసీసీఐ గతంలో కూడి చేసిందన్నారు సదరు బీసీసీఐ అధికారి. 

భారత్‌లో ఐపీఎల్ నిర్వహణకే తొలి ప్రాధాన్యం బీసీసీఐ ఇస్తుందని, ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌పై నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని, ప్రస్తుతానికి ఐపీఎల్ పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. 

వరల్డ్‌కప్‌పై ఐసీసీ తేల్చగానే ఐపీఎల్‌ కార్యాచరణ మొదలవుతుందని సదరు బీసీసీఐ ప్రతినిధి వెల్లడించారు. 2014లో కూడా ఐపీఎల్‌ తొలి దశ మ్యాచులు యుఏఈలో జరిగాయి. 

ఇప్పుడు యూఏఈ లో కరోనా వైరస్‌ సంతృప్తికర స్థాయిలో కట్టడి చేయబడింది. ఐపీఎల్‌ నిర్వహణకు యుఏఈ ఇప్పటికే ఆఫర్‌ ఇచ్చింది. దీంతో బీసీసీఐ దుబాయిలో ఐపీఎల్‌ దిశగా ప్రణాళికలు చేస్తోందని తెలుస్తోంది.

click me!