James Anderson: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా జేమ్స్ అండర్సన్..? ఫోటో వైరల్

By Srinivas MFirst Published May 27, 2023, 10:23 AM IST
Highlights

WTC Finals 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు   టీమిండియాకు కొత్త బౌలింగ్ కోచ్ వచ్చాడా..?  ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ భారత జట్టుతో చేరాడా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16 ఫైనల్ ముగిసిన వెంటనే భారత జట్టు జూన్  7 నుంచి 11 వరకూ ఇంగ్లాండ్‌లో ని ‘ది ఓవల్’ వేదికగా జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్  (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. పదేండ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది  ఐసీసీ ట్రోఫీ నెగ్గాలని పట్టుదలతో ఉన్న భారత జట్టు ఆ మేరకు గట్టిగానే ప్రిపేర్ అవుతోంది. 

తాజాగా  భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ నెగ్గేందుకు  బౌలింగ్ కోచ్‌గా  ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్  అండర్సన్‌ను నియమించుకున్నట్టు సోషల్ మీడియాలో  ఓ  పోస్టు చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో నిజం లేదు.  జేమ్స్ అండర్సన్‌ను   టీమిండియా బౌలింగ్ కోచ్‌గా నియమించారన్నది తప్పుడు ప్రచారమే.  

డబ్ల్యూటీసీ ఫైనల్స్  ప్రిపరేషన్స్ లో భాగంగా ఇదివరకే విరాట్ కోహ్లీ, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ వంటి కొంతమంది ఆటగాళ్లు  అక్కడికి వెళ్లారు.  ప్రాక్టీస్ సెషన్స్‌లో భాగంగా బీసీసీఐ.. టమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో పాటు   కోచింగ్ సిబ్బంది, ఆటగాళ్లు   భారత జట్టు కొత్త జెర్సీ అంబాసిడర్ (అడిడాస్)తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో  ఒకదాంట్లో  శార్దూల్, ఉమేశ్ యాదవ్ ల మధ్య ఉన్న వ్యక్తి  అచ్చం చూడటానికి    అండర్సన్ మాదిరిగానే ఉన్నాడు.  దీంతో  ట్విటర్‌లో నెటిజన్లు ‘బీసీసీఐ గొప్ప నిర్ణయం తీసుకుంది.  డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భారత్ బౌలింగ్ కోచ్‌గా జేమ్స్ అండర్సన్’ అని షేర్ చేశారు.

 

Unveiling 's new training kit 💙💙

Also, kickstarting our preparations for the pic.twitter.com/iULctV8zL6

— BCCI (@BCCI)

మరి ఎవరది..?

ఫోటోలో వైరల్ అవుతున్న వ్యక్తి  అండర్సన్ కాదు. టీమిండియా  స్ట్రైంత్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్. సైడ్ నుంచి చూస్తే సోహమ్ అచ్చం అండర్సన్ మాదిరిగానే ఉండటంతో   నెటిజన్లు ఈ ఫోటోను వైరల్ చేసేశారు.   టీమిండియతో అతడు ఏడాదికి పైగా ప్రయాణం చేస్తున్నాడు.  భారత క్రికెటర్ల ఫిట్నెస్‌ బాధ్యతలు చూసుకునేది   సోహమ్ దేశాయే కావడం గమనార్హం. 

ఇక అండర్సన్ విషయానికొస్తే.. ఇటీవలే కౌంటీ ఛాంపియన్‌షిప్ లో గాయపడి విరామం తీసుకుంటున్న ఈ పేసర్ వచ్చే నెల 16 నుంచి ఆస్ట్రేలియతో జరుగబోయే యాషెస్  సిరీస్  లో పాల్గొనేందుకు సిద్ధమవతున్నాడు.

 

Great decision from BCCI to appoint Jimmy Anderson as the bowling coach https://t.co/iFNDInc9Zc pic.twitter.com/o3ILCYEzuE

— Camlin (@SundarHive)
click me!