భారీ సిక్సర్‌తో అభిమానులకు పండుగ.. తనకు మాత్రం నష్టం

By Siva KodatiFirst Published Aug 28, 2020, 6:11 PM IST
Highlights

భారీ సిక్సర్ల వీరుడు, ఐర్లాండ్ విధ్వంసక ఆటగాడు కెవిన్ ఒబ్రెయిన్‌కు పెద్ద చిక్కుల్లో పడ్డాడు. ఓ అద్దం పగిలిన విషయంలో ఏం చేయాలో తెలియక ఆయన జుట్టు పీక్కుంటున్నాడు. 

భారీ సిక్సర్ల వీరుడు, ఐర్లాండ్ విధ్వంసక ఆటగాడు కెవిన్ ఒబ్రెయిన్‌కు పెద్ద చిక్కుల్లో పడ్డాడు. ఓ అద్దం పగిలిన విషయంలో ఏం చేయాలో తెలియక ఆయన జుట్టు పీక్కుంటున్నాడు.

వివరాల్లోకి వెళితే... ఐర్లాండ్‌లో జరుగుతున్న ఇంటర్ ప్రొవిన్షియల్ టీ 20 కప్ టోర్నీలో గురువారం డబ్లిన్ వేదికగా నార్త్ వెస్త్ వారియర్స్, లీన్‌స్టర్ లైటనింగ్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఆట ప్రారంభంలో వరుణుడు అడ్డుపడటంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు.

మొదట బ్యాటింగ్ చేసిన జట్టులో ఓపెనర్‌గా వచ్చిన కెవిన్.. కేవలం 37 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. కెవిన్ విధ్వంసంతో లీన్ స్టర్ 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వారియర్స్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లీన్‌స్టర్ జట్టు 24 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ సంగతి పక్కనబెడితే... కెవిన్ కొట్టిన 8 భారీ సిక్సర్లలో ఒక బంతి బయట పార్క్ చేసి వున్న కారు అద్దాను పగులగొట్టింది. అయితే ఇక్కడ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఆ కారు మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకుడిది కాదు.. స్వయంగా కెవిన్ ఓబ్రెయిన్‌దే. ఈ విషయం తెలియని కెవిన్ ఓబ్రెయిన్ మ్యాచ్ అనంతరం పార్క్ చేసిన  తన కారు వద్దకు వెళ్లగా అద్దాలు ధ్వంసమై కనిపించింది.

జరిగినది అర్థం చేసుకుని కారును రిపేయిరింగ్‌కు తరలించాడు. గ్యారేజ్‌కు వెళ్లేముందు తన కారుతో కొన్ని ఫోటోలు దిగాడు. వీటిని టయోటా తన ట్వీట్టర్‌లో షేర్ చేసింది.

‘‘ ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని.. తాను కొట్టిన సిక్స్, తన కారు అద్దాలనే ధ్వంసం చేసిందన్నాడు. ఇక మీద తన కారును గ్రౌండ్‌కు దూరంగా పార్క్ చేస్తానని కెవిన్ వెల్లడించాడు. 

click me!