చెన్నై సూపర్ కింగ్స్‌లో పలువురు ఆటగాళ్లకు కరోనా: క్వారంటైన్‌లోకి ధోనీ సేన

Siva Kodati |  
Published : Aug 28, 2020, 05:36 PM IST
చెన్నై సూపర్ కింగ్స్‌లో పలువురు ఆటగాళ్లకు కరోనా: క్వారంటైన్‌లోకి ధోనీ సేన

సారాంశం

ఐపీఎల్‌లో పాల్గొనేందుకు యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం రేపింది. అక్కడ నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో కొందరు ఆటగాళ్లకు పాజిటివ్‌గా తేలింది

ఐపీఎల్‌లో పాల్గొనేందుకు యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా కలకలం రేపింది. అక్కడ నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో కొందరు ఆటగాళ్లకు పాజిటివ్‌గా తేలింది.

యూఏఈకి వెళ్లిన జట్టు సభ్యులకు నిబంధనల ప్రకారం.. ఒకటి, మూడు, ఆరో రోజున టెస్టులు నిర్వహించారు. ఆ టెస్టుల్లో కొంతమంది జట్టు సభ్యులకు పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

దీంతో చెన్నై జట్టుకు క్వారంటైన్ పీరియడ్‌ను మళ్లీ పొడిగించారు. సెప్టెంబర్ 1 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు క్వారంటైన్‌లో ఉండనుంది. బీసీసీఐ ఇప్పటి వరకు ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించలేదు. ఇప్పటికే ముందుగా యూఏఈ వెళ్లిన జట్లు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాయి. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు