142 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో... ఐర్లాండ్ క్రికెటర్ అరుదైన రికార్డు

By Siva KodatiFirst Published Mar 18, 2019, 12:04 PM IST
Highlights

ఐర్లాండ్ క్రికెటర్ టిమ్ ముర్టాగ్ 142 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సృష్టించాడు. టెస్ట్ హోదా అందుకున్న తర్వాత ఆఫ్గనిస్తాన్, ఐర్లాండ్ దేశాల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టిమ్ ఈ ఘనతను అందుకున్నాడు

ఐర్లాండ్ క్రికెటర్ టిమ్ ముర్టాగ్ 142 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సృష్టించాడు. టెస్ట్ హోదా అందుకున్న తర్వాత ఆఫ్గనిస్తాన్, ఐర్లాండ్ దేశాల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టిమ్ ఈ ఘనతను అందుకున్నాడు.

11వ నెంబర్ ఆటగాడికి బరిలోకి దిగి రెండు ఇన్నింగ్సుల్లోనూ 25 పరుగులకు పైగా నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్సులో అర్ధసెంచరీ చేసిన ముర్టాగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, ఓవర్‌నైట్ స్కోరు 22/1తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఐర్లాండ్ 288 పరుగులకు అలౌటైంది.

బాల్‌బిర్నీ 82, ఓబ్రియాన్ 56 పరుగులతో రాణించారు. దీంతో ఆఫ్గానిస్తాన్‌ ముందు 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. ఎహ్‌సానుల్లా 16, రహమత్‌షా 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

click me!