ఐపిఎల్ ప్రసార సమయంలో ఆ యాడ్స్ వద్దు: స్టార్ స్పోర్ట్స్ కు తేల్చిచెప్పిన బిసిసిఐ

By Arun Kumar PFirst Published Mar 16, 2019, 10:20 AM IST
Highlights

ఐపిఎల్...భారతీయ క్రీడాభిమానులకు సమ్మర్ లో వినోదాల విందును అందించే క్రికెట్ టోర్నీ. లోక్ సభ ఎన్నికలు... దేశ రాజకీయాలను మరింత హాట్ హాట్ గా మార్చి  రాజకీయ నాయకులే కాదు సామాన్యులు కూడా ఆసక్తిని కనబరిచే రాజకీయ పోరాటం. అయితే ఈ రెండూ ఈసారి  ఒకేసారి కలిసి వచ్చి భారత ప్రజలకు మరింత మజాను ఇవ్వనున్నాయి. ఈ రెండు కేవలం మజానే కాదు టివి చానళ్లను ఆదాయంలో ముంచెత్తడంలో కూడా ముందుంటాయి.  
 
ఈ విషయాన్ని గుర్తించిన స్టార్ స్పోర్ట్స్ సంస్థకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఇప్పటికే ఐపిఎల్ ప్రసార హక్కులను పొందిన ఈ సంస్థ సార్వత్రిక ఎన్నికలను కూడా ఆదాయ  వనరుగా మార్చుకోవాలని ప్రయత్నించింది. ఇలా ఐపిఎల్ సీజన్ తో పాటు ఎన్నికల సీజన్ కూడా ఒకే సారి పూర్తిచేసి భారీ ఆదాయాన్ని మూటగట్టుకోవాలన్న స్టార్ స్పోర్ట్స్ ఆశలపై బిసిసిఐ( భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్) నీళ్లు చల్లింది. 

ఇంతకూ విషయమేంటంటే...ఈసారి ఐపిఎల్, సార్వత్రిక ఎన్నికలు ఒకే సమయంలో వస్తున్నాయి. కాబట్టి ఐపిఎల్ మ్యాచ్ ల ప్రసార సమయాల్లో వాణిజ్య, క్రీడా సంబంధమైన యాడ్స్ తో పాటు  రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయాలని స్టార్ సంస్థ  భావించింది. అయితే ఐపిఎల్ ఒప్పందంలో ఈ విషయం గురించి ప్రస్తావన లేకపోవడంతో బిసిసిఐ నుండి అనుమతి పొందడం తప్పనిసరిగా మారింది. అందుకోసం బిసిసిఐని అనుమతివ్వాలని కోరిన ప్రసార సంస్ధకు నిరాశే ఎదురయ్యింది. 

ఐపిఎల్ మీడియా హక్కుల ఒప్పందం (ఎంఆర్‌ఏ) ప్రకారం మ్యాచ్‌లు జరిగే సమయంలో రాజకీయ లేదా మతపరమైన ప్రకటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసారం చేయరాదు. కాబట్టి స్టార్ స్పోర్ట్స్ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని  బిసిసిఐ తేల్చిచెప్పింది. దీంతో స్టార్ స్పోర్ట్స్ రాజకీయల ప్రకటనల ఆలోచనను వదులుకుంది. 

click me!