
విజయ్ శంకర్, ఐపీఎల్‌లో మోస్ట్ ట్రోల్డ్ ప్లేయర్. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ఉన్నప్పుడు విజయ్ శంకర్, సరిగ్గా ఆడి గెలిపించిన మ్యాచుల కంటే గెలుస్తాం అనుకున్న మ్యాచులను ఓడించిందే ఎక్కువ.. అలాంటి విజయ్ శంకర్, కేకేఆర్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు...
విజయ్ శంకర్ సునామీ హాఫ్ సెంచరీ కారణంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. 17 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, సునీల్ నరైన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు..
31 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా సునీల్ నరైన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. స్కోరు వేగం పెంచేందుకు ప్రయత్నించిన గిల్, ఉమేశ్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్..
23 ఏళ్ల 27 రోజుల వయసులో రిషబ్ పంత్ 2 వేల ఐపీఎల్ పరుగుల క్లబ్‌లో చేరగా శుబ్‌మన్ గిల్ వయసు 23 ఏళ్ల 214 రోజులు. సంజూ శాంసన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా తర్వాతి స్థానాలలో ఉన్నారు..
8 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేసిన అభినవ్ మనోహార్, యంగ్ బౌలర్ సుయాశ్ శర్మ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...
వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సాయి సుదర్శన్‌కి ఇది ఈ సీజన్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ.. 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసిన సాయి సుదర్శన్, సునీల్ నరైన్ బౌలింగ్‌లో అనుకుల్‌రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన సునీల్ నరైన్, ఐపీఎల్ కెరీర్‌లో 15వ సారి మూడు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. జస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ 19 సార్లు ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉంటే అమిత్ మిశ్రా 17 సార్లు, డ్వేన్ బ్రావ్, ఉమేశ్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ 16 సార్లు మూడేసి వికెట్లు తీసి మూడో స్థానంలో ఉన్నారు..
లూకీ ఫర్గూసన్ వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 25 పరుగులు రాబట్టిన విజయ్ శంకర్, శార్దూల్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు బాదాడు. 21 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న విజయ్ శంకర్, 24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శంకర్ ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి 2 ఓవర్లలో 45 పరుగులు రాబట్టింది గుజరాత్ టైటాన్స్..