కష్టపడ్డ.. దేవునికి మొక్కిన..! అయినా ఆడనిస్తలేరు.. సన్ రైజర్స్ పేసర్ ఆసక్తికర ట్వీట్

Published : Apr 09, 2023, 04:43 PM IST
కష్టపడ్డ.. దేవునికి మొక్కిన..! అయినా ఆడనిస్తలేరు.. సన్ రైజర్స్ పేసర్ ఆసక్తికర ట్వీట్

సారాంశం

IPL 2023: ఐపీఎల్ మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తేవడమే కాదు.. కొంతమంది స్టార్లను అదే వెలుగు నుంచి చీకటి లోయలో కూడా పడేస్తుంది. 

ఆట అన్నివేళలా మనం అనుకున్నట్టు  ఉండదు. ఓవర్ నైట్ స్టార్  ను చేసిందని సంబురపడేలోపు  ఒక్కోసారి అది  విసిరే సవాళ్లను మనం  ఎంతగా ఎదురొడ్డి పోరాడినా  క్రూరంగా అణిచివేస్తుంది. ఇందుకు క్రికెట్ ఏ మాత్రమూ మినహాయింపు కాదు.  మట్టిలో మాణిక్యాలను వెలికితీసిన ఐపీఎల్..  ‘ఇతడే ఫ్యూచర్  సూపర్  స్టార్’ అనేవారిని కూడా  ‘తర్వాత సీజన్ లో ఆడితే మహా గొప్ప’ అనే రేంజ్ లో కిందపడేస్తుంది.  ఇందుకు కారణాలు ఏవై ఉన్నా  స్టార్ హోదాలో వెలుగు వెలిగిన ఆటగాళ్లు ఒక్కసారిగా ఫేడ్ అవుట్ అయిపోతారు.    ప్రస్తుతం  అదే భయంలో   ఉన్నాడు  సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ కార్తీక్ త్యాగి.  

2022లో  సన్ రైజర్స్ జట్టు.. వేలంలో కార్తీక్ త్యాగిని  రూ. 4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.  2022 లో అతడితో  రెండంటే రెండు  మ్యాచ్ లు మాత్రమే ఆడించి  అతడిని పక్కనబెట్టింది.  ఆ సీజన్ తో పాటు ప్రస్తుత సీజన్ లో కూడా  త్యాగిని ఆడించడమంటే  ఏదో అద్భుతమే జరగాలి. 

కాగా ఐపీఎల్ లో నేడు  పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ కు ముందు  కార్తీక్ త్యాగి   తన ట్విటర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశాడు.   తనకు అవకాశం కావాలని.. ఒక్క  ఛాన్స్ ఇవ్వాలని  కోరకనే కోరుతున్నాడు.   ఉప్పల్ లో   ప్రాక్టీస్ చేస్తూ..   ‘నేను  చాలా కష్టపడుతున్నా.   నిజాయితీగా  ప్రార్థిస్తున్నా. మిగిలింది దేవుడికి వదిలేస్తున్నా..’ అని  ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్  కొద్దిసేపట్లోనే నెట్టింట వైరల్ గా మారింది.  

 

2020లో జరిగిన అండరర్ - 19 వరల్డ్ కప్ లో  నిలకడగా రాణించి  ఆకట్టుకున్న  ఈ పేసర్ ను   ఆ ఏడాదితో పాటు 2021లో కూడా  రాజస్తాన్ రాయల్స్  ఆడించింది. 2020లో 10 మ్యాచ్ లు ఆడి  9 వికెట్లు తీసిన  అతడు.. 2021లో  నాలుగు మ్యాచ్ లు ఆడి  నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు.   2022 వేలంలో త్యాగిని  రూ. 4 కోట్లకు కొనుగోలు చేసిన  సన్ రైజర్స్.. అతడితో రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడించింది.  ఈ రెండు మ్యాచ్ లలో అతడు ఒక్క వికెట్ తీశాడు.  ఈ ఏడాది   త్యాగిని ఆడించేది అనుమానమే. 

టీమ్ లో ఇప్పటికే భువనేశ్వర్ రూపంలో సీనియర్ పేసర్ కాస్తో కూస్తో రాణిస్తున్నాడు.    స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్,   యార్కర్ల నట్టూను టీమ్  నుంచి తీసేయడం అంత ఈజీ కాదు.  వీరికి జతగా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఫజుల్ ఫరూఖీ కూడా వస్తున్నాడు. వీరందరినీ కాదని త్యాగికి అవకాశం దక్కాలంటే మార్క్‌రమ్ కు కూడా కాస్త కష్టమే.   ఇస్తే గిస్తే  సౌతాఫ్రికాకే చెందిన  మార్కో జాన్సన్ ను కాదని  త్యాగికి అవకాశం ఇస్తాడా..?  అనేది కూడా మిలియన్ డాలర్ల  ప్రశ్నే..!
 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు