IPL2023 CSK vs GT Qualifier 1: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్... ఫైనల్ చేరేదెవరు?

By Chinthakindhi RamuFirst Published May 23, 2023, 7:03 PM IST
Highlights

IPL2023 CSK vs GT Qualifier 1:  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... 

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 


లీగ్ స్టేజీలో 14 మ్యాచుల్లో 10 విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా మొదటి క్వాలిఫైయర్‌కి అర్హత సాధించింది గుజరాత్ టైటాన్స్. గత సీజన్‌లో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన గుజరాత్ టైటాన్స్, వరుసగా రెండో సీజన్‌లో కూడా టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో మిగిలిన టీమ్స్‌కి చుక్కలు చూపించింది..

గత సీజన్‌ నుంచి ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచులు జరగగా మూడింట్లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కి పరాజయం తప్పలేదు. గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచుల్లోనూ సీఎస్‌కేని ఓడించి, పైచేయి సాధించింది... అయితే ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌లో తలబడడం ఇదే తొలిసారి...

ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 12వ సారి ప్లేఆఫ్స్ చేరుకుంది చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్‌కే ప్రధాన బలం ఓపెనర్లే. రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే నిలకడైన ప్రదర్శనతో టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. శివమ్ దూబే కూడా ఈ సీజన్‌లో కీ పర్ఫామర్‌గా మారాడు...

ఆరంభంలో అదరగొట్టిన అజింకా రహానే, సెకండాఫ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మొయిన్ ఆలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా ప్లేఆఫ్స్‌లో మహా డేంజరస్ ప్లేయర్లుగా మారతారు.. అన్‌క్యాప్డ్ బౌలర్ తుషార్ దేశ్‌పాండేపైనే ఎక్కువ ఆధారపడింది సీఎస్‌కే...

దీపక్ చాహార్ గాయం నుంచి కోలుకున్న తర్వాత గత మ్యాచ్‌లో కాస్త బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. మతీశ పథిరాణా, డెత్ ఓవర్ బౌలర్‌గా అదరగొడుతున్నాడు. వీళ్లందరినీ నడిపించే ధోనీ కెప్టెన్సీ, సీఎస్‌కేకి ప్రధాన బలం..

వృద్ధిమాన్ సాహా నిలకడగా పరుగులు చేయలేకపోతున్నా శుబ్‌మన్ గిల్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్ అదరగొడుతున్నారు. టాపార్డర్ ఫెయిల్ అయినా 200+ స్కోరు చేయగల బ్యాటింగ్ యూనిట్ ఉన్న టీమ్ గుజరాత్ టైటాన్స్...

అలాగే రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ కలిసి ఈ సీజన్‌లో 65 వికెట్లు పడగొట్టారు. 150 స్కోరు చేసినా దాన్ని నియంత్రించగల బ్యాటింగ్ యూనిట్ కూడా గుజరాత్ టైటాన్స్‌లో ఉంది. దీంతో ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ సీఎస్‌కే, రీసెంట్ సెన్సేషన్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మొదటి క్వాలిఫైయర్‌లో హోరాహోరీ పోరు ఆశించవచ్చు...

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇది: రుతురాజ్ గైక్వాడ్, డివాన్ కాన్వే, అజింకా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ ఆలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), దీపక్ చాహార్, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ 

గుజరాత్ టైటాన్స్ జట్టు ఇది: శుబ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దసున్ శనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్షన్ నల్కండే, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ

click me!