
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ అంటే కెఎల్ రాహుల్‌కి ప్రత్యేకమైన అభిమానం. అందుకే ముంబైపై మరోసారి వీర లెవెల్‌లో విరుచుకుపడ్డాడు కెఎల్ రాహుల్. ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కెఎల్ రాహుల్, రెండో మ్యాచ్‌లో మరో సెంచరీ చేసి లక్నో సూపర్ జెయింట్స్‌కి భారీ స్కోరు అందించాడు...
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగుల స్కోరు చేసింది. 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత మనీశ్ పాండే, కెఎల్ రాహుల్ కలిసి రెండో వికెట్‌కి 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 22 బంతుల్లో ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన మనీశ్ పండే, కిరన్ పోలార్డ్ బౌలింగ్‌లో రిలే మెడరిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3 బంతులాడిన పరుగులేమీ చేయలేకపోయిన మార్కస్ స్టోయినిస్... డానియల్ సామ్స్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు...
కృనాల్ పాండ్యా 1 పరుగు చేసి కిరన్ పోలార్డ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. దీపక్ హుడా 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసి రిలే మెడరిత్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన కెఎల్ రాహుల్... ముంబై ఇండియన్స్‌పై 800+ పరుగులు పూర్తి చేసుకున్నాడు...
ముంబై ఇండియన్స్‌పై 8వ 50+ స్కోరు నమోదు చేసిన కెఎల్ రాహుల్, ఆ జట్టుపై అత్యధిక హాఫ్ సెంచరీ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు సురేష్ రైనా 7 సార్లు ముంబై ఇండియన్స్‌పై 50+ స్కోర్లు నమోదు చేయగా డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్, మనీశ్ పాండే, శిఖర్ ధావన్ ఆరేసి సార్లు ఈ ఫీట్ సాధించారు...
జయ్‌దేవ్ ఉనద్కత్ వేసిన 18వ ఓవర్‌లో ఆఖరి 3 బంతుల్లో హ్యట్రిక్ ఫోర్లు బాదిన కెఎల్ రాహుల్... జస్ప్రిత్ బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు.
రిలే మెడరిత్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతికి సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెఎల్ రాహుల్‌కి ఐపీఎల్‌లో ఇది నాలుగో సెంచరీ. క్రిస్ గేల్ 6 ఐపీఎల్ సెంచరీలతో, విరాట్ కోహ్లీ 5 సెంచరీలతో కెఎల్ రాహుల్ కంటే ముందున్నారు.
11 బంతుల్లో ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన ఆయుష్ బదోనీ... మెడిరిత్ బౌలింగ్‌లో పోలార్డ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆఖరి రెండు బంతులకు పరుగులేమీ ఇవ్వకుండా జాసన్ హోల్డర్‌ని సైలెంట్‌గా ఉంచిన రిలే మెడరిత్... లక్నో సూపర్ జెయింట్స్ స్కోరును 168 పరుగులకి పరిమితం చేయగలిగాడు. కెఎల్ రాహుల్ 62 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.