IPL2022 KKR vs GT: హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీ, రస్సెల్ టర్నింగ్ స్పెల్... కేకేఆర్ ముందు..

Published : Apr 23, 2022, 05:24 PM IST
IPL2022 KKR vs GT: హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీ, రస్సెల్ టర్నింగ్ స్పెల్... కేకేఆర్ ముందు..

సారాంశం

ఐపీఎల్ 2022 సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేసిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... ఆఖరి ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆండ్రే రస్సెల్... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా... బీభత్సమైన ఫామ్‌ని కంటిన్యూ చేస్తున్నాడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీ చేశాడు పాండ్యా. ఐపీఎల్ 2022 సీజన్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచాడు హార్ధిక్ పాండ్యా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. 

ఇప్పటిదాకా 34 మ్యాచులు జరగగా ప్రతీ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన కెప్టెన్లు, మరో ఆలోచన లేకుండా తొలుత ఫీల్డింగ్ చేయడానికే మొగ్గు చూపారు. హార్ధిక్ పాండ్యా ఆ సిస్టమ్‌ని బ్రేక్ చేశాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో 15 మ్యాచులు ముగిసిన తర్వాత టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోగా, ఈ సారి ఏకంగా 34 మ్యాచుల తర్వాత హార్ధిక్ పాండ్యా ఆ వరుసను బ్రేక్ చేశాడు...

మొదటి మూడు మ్యాచుల్లో రెండు వరుస 80+ స్కోర్లతో మెప్పించిన శుబ్‌మన్ గిల్ 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి నిరాశపరిచాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో సామ్ బిల్లింగ్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు శుబ్‌మన్ గిల్. 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది గుజరాత్ టైటాన్స్...

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన హార్ధిక్ పాండ్యా, ఓపెనర్ వృద్ధిమాన్ సాహాతో కలిసి రెండో వికెట్‌కి 75 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. 25 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా... ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత డేవిడ్ మిల్లర్‌తో కలిసి మూడో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు హార్ధిక్ పాండ్యా. 20 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్, శివమ్ మావి బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన హార్ధిక్ పాండ్యా... 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

రషీద్ ఖాన్ 2 బంతులాడి డకౌట్ కాగా...  ఇన్నింగ్స్ 20వ ఓవర్ బౌలింగ్ చేసిన ఆండ్రే రస్సెల్ మొదటి 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. 4 బంతుల్లో 2 పరుగులు చేసిన అభినవ్ మనోహర్, రింకూ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా... ఆ తర్వాతి బంతికి ఫర్గూసన్ కూడా అలాగే రింకూ సింగ్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత రాహుల్ తెవాటియా 12 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసి రింకూ సింగ్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా ఆఖరి బంతికి యష్ దయాల్‌ను డకౌట్ చేశాడు రస్సెల్. ఆఖరి ఓవర్‌లో 5 పరుగులు రాబట్టిన గుజరాత్ టైటాన్స్, ఏకంగా 4 వికెట్లు కోల్పోయింది.
 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !