IPL2022 KKR vs DC: కేకేఆర్‌పై రివెంజ్ తీర్చుకున్న కుల్దీప్ యాదవ్... ఢిల్లీ క్యాపిటల్స్ ముందు...

Published : Apr 28, 2022, 09:24 PM IST
IPL2022 KKR vs DC: కేకేఆర్‌పై రివెంజ్ తీర్చుకున్న కుల్దీప్ యాదవ్... ఢిల్లీ క్యాపిటల్స్ ముందు...

సారాంశం

IPL 2022 KKR vs DC: నితీశ్ రాణా హాఫ్ సెంచరీ, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్... 4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్... ఆఖరి ఓవర్‌లో ముస్తాఫిజుర్ రహ్మాన్‌కి మూడు వికెట్లు...   

గత సీజన్లలో తనను రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసి ఘోరంగా అవమానించి, మెంటల్‌గా కృంగదీసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై మరోసారి రివెంజ్ తీర్చుకున్నాడు కుల్దీప్ యాదవ్. కేకేఆర్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్... రెండో మ్యాచ్‌లోనూ చెలరేగిపోయి ఇంకా బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చాడు...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగుల ఓ మాదిరి స్కోరు చేసింది. ఆరోన్ ఫించ్ 7 బంతుల్లో 3 పరుగులు చేసి ఛేతన్ సకారియా ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 12 బంతుల్లో 6 పరుగులు చేసిన మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సకారియాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

నేటి మ్యాచ్ ద్వారా ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన బాబా ఇంద్రజిత్‌ 8 బంతుల్లో 6 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పావెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే సునీల్ నరైన్‌ని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు కుల్దీప్ యాదవ్...

35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా కలిసి కేకేఆర్‌ని ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని కుల్దీప్ యాదవ్ విడదీశాడు...

37 బంతుల్లో 4 ఫోర్లతో 42 పరుగులు చేసిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ పట్టిన లో క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. అదే ఓవర్‌ నాలుగో బంతికి డేంజరస్ మ్యాన్ ఆండ్రే రస్సెల్ వికెట్ కోల్పోయింది కేకేఆర్...

3 బంతులాడి పరుగులేమీ చేయలేకపోయిన రస్సెల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత రింకూ సింగ్, నితీశ్ రాణా కలిసి ఏడో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

16 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసిన రింకూ సింగ్, ముస్తాఫిజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో పావెల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఐపీఎల్‌లో 15వ హాఫ్ సెంచరీ బాదిన నితీశ్ రాణా... 34 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో రింకూ సింగ్, నితీశ్ రాణాలను అవుట్ చేసిన ముస్తాఫిజుర్ రహ్మాన్, టిమ్ సౌథీని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆఖరి ఓవర్‌లో కేవలం 2 పరగులు మాత్రమే రావడంతో 150 స్కోరును దాటలేకపోయింది కేకేఆర్...   

ముస్తాఫిజుర్ రహ్మాన్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 3 ఓవర్లలో 14 పరుగులిచ్చి 4 వికెట్లు పడొట్టాడు. చేతన్ సకారియా, అక్షర్ పటేల్ చెరో ఓ వికెట్ తీశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !