IPL2021 RCB vs KKR: టాస్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్.. బిగ్ ఫైట్ లో నిలిచేదెవరు..? నిష్క్రమించేదెవరు..?

By team teluguFirst Published Oct 11, 2021, 7:10 PM IST
Highlights

IPL Eliminator Live: తొలి ఐపీఎల్ టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఎలిమినేటర్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో పడుతూ లేస్తూ ఐపీఎల్ ఫైనల్స్ కు చేరిన కోల్కతా నైట్ రైడర్స్ నేటి మ్యాచ్ లో నెగ్గి ఢిల్లీ  క్యాపిటల్స్ తో అమీతుమీ తేల్చుకోవాలని భావిస్తున్నది. మరి ఈ బిగ్ ఫైట్ లో నిలిచేదెవరు..? నిష్క్రమించేదెవరు..? 

ఐపీఎల్ 14 వ సీజన్ ముగింపు దశకు చేరింది. ఆదివారం తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగగా.. నేడు Virat Kohli సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,  Eion Morgan నేతృత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్  హోరాహోరి తలపడబోతున్నాయి. ఈ కీలక పోరులో గెలిచిన జట్టే తర్వాత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడే అవకాశం దక్కుతుంది. కాగా, ఈ కీ ఫైట్ లో టాస్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్  ఎంచుకుంది. ఇరు జట్లు తుది జట్లలో ఎలాంటి మార్పులూ చేయలేదు. గత మ్యాచ్ లలో ఆడిన సభ్యులే ఆడుతున్నారు. 

పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఈ జట్లు.. IPLలో ఇప్పటివరకు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో Kolkata Knight Riders 15 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇక Royal challengers Banglore 13 సార్లు నెగ్గింది. IPL-14 సీజన్ లో రెండు జట్లు రెండుసార్లు పోటీ పడగా చెరొకటి గెలిచాయి.

విరాట్ సారథ్యంలోని RCB ఇంతవరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా నెగ్గలేదు. ఈ సీజన్ తో అతడు బెంగళూరు కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించాడు. 2016లో ఫైనల్స్ కు చేరినా ఆ జట్టు ఓడిపోయింది. గతేడాది హైదరాబాద్ చేతిలో ప్లేఆఫ్స్ లో వెనుదిరిగింది. దీంతో ఈసారి ఆ జట్టు మరింత పట్టుదలగా ఆడే అవకాశముంది. అంతేగాక గత మ్యాచ్ లో  ఇన్నింగ్స్ చివరిబంతికి సిక్సర్ కొట్టి గెలవడంతో ఆ జట్టు ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. ఇక ఇప్పటికే 2012, 2014 సీజన్ లలో IPL Trophy నెగ్గిన KKR.. ఈసారీ టైటిల్ నెగ్గాలని ఉవ్విళ్లూరుతున్నది. దీంతో ఇరుజట్ల మధ్య టఫ్ ఫైట్ సాగుతుందనడంలో సందేహమే లేదు.

షార్జా వేదికగా జరుగుతున్న నేటి మ్యాచ్ లో గెలిచిన జట్టే ముందంజ వేస్తుంది. బలాబలాల్లో రెండు జట్లు సమానంగా ఉన్నాయి. బ్యాటింగ్ లో  ఆర్సీబీ తరఫున ఓపెనర్లు విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ జోరుమీదుండగా ఆ తర్వాత వచ్చే  తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్, మ్యాక్స్వెల్, డివిలియర్స్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ లో హర్షల్ పటేల్  ఈ సీజన్ లోనే అత్యధిక వికెట్లు తీసిన వీరుడిగా కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్ లో మరో రెండు వికెట్లు తీస్తే అతడు బ్రావో రికార్డును బద్దలుకొడతాడు. అతడికి సిరాజ్, గార్టన్, చాహల్ అద్భుతంగా సహకరిస్తున్నారు. 

మరోవైపు కోల్కతా కూడా ఏం తక్కువ తినలేదు. బ్యాటింగ్ లో శుభమన్ గిల్, వెంకటేష్ అయ్యర్, త్రిపాఠి కీలకంగా ఉన్నారు. ఆఖర్లో రెచ్చిపోవడానికి నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్ లూ సిద్ధమయ్యారు. ఇక  స్పిన్ త్రయం వరుణ్, నరైన్, షకీబ్ లకు తోడు ఫెర్గుసన్ అద్భుతంగా రాణిస్తున్నారు. 

జట్లు: 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
 దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి (కెప్టెన్),  శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్, గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

కోల్కతా నైట్ రైడర్స్: శుభమన్ గిల్, వెంకటేష్ అయ్యర్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), షకీబ్, సునీల్ నరైన్, ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి 

click me!