ప్రపంచకప్ లో వాళ్లిద్దరూ అద్భుతాలు చేస్తారు: ధోని, కోహ్లిలపై మాజీ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్

By team teluguFirst Published Oct 11, 2021, 6:02 PM IST
Highlights

MSK Prasad: త్వరలో యూఏఈ వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ లో  భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి,  మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కలిసి వండర్స్ క్రియేట్ చేస్తారని బీసీసీఐ మాజీ సెలెక్టర్ వెంకటేష్ ప్రసాద్ అన్నాడు. వీరిద్దరితో పాటు అశ్విన్, రవిశాస్త్రి పైనా అతడు కామెంట్స్ చేశాడు. 

ఈనెల 17 నుంచి యూఏఈలో మొదలుకానున్న T20 World Cupలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, మెంటార్ మహేంద్ర సింగ్ ధోనిలు అద్భుతాలు సృష్టిస్తారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాజీ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నాడు. MS Dhoni, Virat Kohliల మధ్య మంచి అనుబంధం ఉన్నదని, అది వాళ్లిద్దరికే గాక టీమిండియాకూ లాభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ధోని, కోహ్లిలతో పాటు టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు సెలెక్షన్, కోచ్ రవిశాస్త్రి, అశ్విన్, జడేజాల జోడీ గురించి MSK Prasad పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ధోనిని మెంటార్ గా నియమించడంపై మాట్లాడుతూ.. ‘ఇది అద్భుతమైన నిర్ణయం. ధోని, రవి లతో విరాట్ మంచి అనుబంధం కలిగి ఉంటాడు. ధోని నేతృత్వంలో విరాట్ చాలా మ్యాచ్ లు ఆడాడు. శాస్త్రి కోచ్ గా.. విరాట్ ఆటగాడిగా ఎన్నో విజయాలు అందించారు. వీళ్లు ముగ్గురు కలిసి చాలా కాలం పాటు భారత క్రికెట్ ను శాసించారు.  ఇక మాస్టర్ మైండ్ లాంటి ధోని ఎంపిక కచ్చితంగా భారత జట్టుకు లాభించేదే. మెంటార్ గా అతడిని నియమించడం విరాట్ కు బూస్ట్ ఇచ్చేదే. స్వదేశ, విదేశాల్లో గెలిచిన విరాట్.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం విఫలమవుతున్నాడు. కానీ ఇప్పుడు అతడికి ధోని అండ దొరికింది. వాళ్లిద్దరూ కలిసి రాబోయే టీ20 ప్రపంచకప్ లో వండర్స్ చేస్తారు’ అని అన్నాడు. 

టీమిండియా సెలక్షన్ పై స్పందిస్తూ.. రాహుల్ చాహర్ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను తీసుకుంటే బావుండేదని ప్రసాద్ సూచించాడు. టీ20 లో India తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా చాహల్ (49 మ్యాచుల్లో 63 వికెట్లు) కు మంచి రికార్డు ఉన్నదని, అటువంటి ఆటగాడిని పక్కనబెట్టడం సమంజసం కాదని అన్నాడు. అంతేగాక టీ20 ప్రపంచకప్ లో శిఖర్ దావన్ కూడా లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నాడు. 

ఇక రవిచంద్రన్, అశ్విన్ ల అనుభవం భారత జట్టుకు ఉపయోగపడుతుందని ప్రసాద్ చెప్పాడు. వారిద్దరూ కలిసి చాలాకాలంగా భారత బౌలింగ్ కు వెన్నెముకగా ఉన్నారని.. ఆపద సమయాల్లో వీళ్లిద్దరూ  జట్టును ఆదుకుంటారని చెప్పుకొచ్చాడు. కోచ్ గా రవిశాస్త్రి అద్బుతాలు చేశాడన్న ప్రసాద్.. అతడి తర్వాత రాహుల్ ద్రావిడ్  భారత్ కు హెడ్ కోచ్ గా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు. ద్రావిడ్ కోచ్ గా, ధోని మెంటార్ గా ఉంటే జట్టుకు మంచి జరుగుతుందని  ప్రసాద్ తెలిపాడు. 

click me!