IPL2021 DC vs KKR: ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన కేకేఆర్... ప్లేఆఫ్ రేసులో మరింత ముందుకు...

By Chinthakindhi RamuFirst Published Sep 28, 2021, 7:13 PM IST
Highlights

మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... ఢిల్లీ క్యాపిటల్స్‌కి సీజన్‌లో మూడో పరాజయం... 

ఐపీఎల్ 2021 ఫ్లేఆఫ్ రేసులో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మరో అడుగు ముందుకేసింది. పాయింట్ల పట్టికలో టాప్‌లో వెళ్లాలని ఆశించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి, టాప్ 4లో తన ప్లేస్‌ను మరింత మెరుగుపర్చుకుంది...

128 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన కేకేఆర్‌కి శుభారంభం దక్కలేదు. 15 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, లలిత్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 28 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది కేకేఆర్...

ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి 5 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసి, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... ఆ తర్వాత 33 బంతుల్లో  ఓ ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ను రబాడా అవుట్ చేశాడు...

గిల్ వికెట్ తీసిన రబాడా, ఆ ఓవర్‌లో పరుగులేమీ ఇవ్వకుండా వికెట్ మెయిడిన్ వేశాడు... ఆ తర్వాత ఇయాన్ మోర్గాన్‌ను, అశ్విన్ డకౌట్ చేశాడు.. ఐపీఎల్ 2021 సీజన్‌లో మోర్గాన్ డకౌట్ కావడం ఇది మూడోసారి... 2014 సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తర్వాత 2021 సీజన్‌లో ఇయాన్ మోర్గాన్ ఒకే సీజన్‌లో మూడుసార్లు డకౌట్ అయిన కేకేఆర్ కెప్టెన్‌గా నిలిచాడు...

ఆ తర్వాత దినేశ్ కార్తీక్ 14 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేయగా సునీల్ నరైన్ 10 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత టిమ్ సౌతీ 3 పరుగులకే అవుట్ అయినా నితీశ్ రాణా 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు...

click me!