ఐపీఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసింది! ప్రారంభం ఎప్పటినుండి అంటే....

By Sreeharsha GopaganiFirst Published Jun 17, 2020, 12:46 PM IST
Highlights

ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణకు అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు చెబుతామని ఇటీవల రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు రాసిన లేఖలో పేర్కొన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.. ఆ దిశగా తొలి అడుగు వేసినట్టు కనిపిస్తోంది. 

టి 20 ప్రాపంచ కప్ పై ఐసీసీ ఎటూ తేల్చకపోతుండడంతో.... బీసీసీఐ మాత్రం ఐపీఎల్ నిర్వహించేందుకు పావులు కదుపుతుంది. నాలుగువేల కోట్ల ఆదాయాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు బీసీసీఐ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఐపీఎల్ తాత్కాలిక షెడ్యూల్ రూపొందించింది. 

ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణకు అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు చెబుతామని ఇటీవల రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు రాసిన లేఖలో పేర్కొన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.. ఆ దిశగా తొలి అడుగు వేసినట్టు కనిపిస్తోంది. 

వర్థమాన, భవిష్యత్‌ పరిస్థితులను బేరీజు వేసుకుని ఐపీఎల్‌13కు తాత్కాలిక షెడ్యూల్‌ రూపొందించారు. సెప్టెబర్‌ 26న ఆరంభం కానున్న ఐపీఎల్‌, నవంబర్‌ 8న టైటిల్‌ పోరుతో ముగియనుంది. ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక షెడ్యూల్‌ సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. బీసీసీఐ ఐపీఎల్‌ నిర్వహణకు పట్టుదలగా వ్యవహరిస్తుండటంతో ఈ ఏడాది ఆసియాకప్‌, టీ20 వరల్డ్‌కప్‌ ఉండనట్టే!

జూన్‌ 10 ఐసీసీ టెలీ కాన్ఫరెన్స్‌ సమావేశంలో టీ20 వరల్డ్‌కప్‌పై ఏటూ తేల్చలేదు. మరో నెల రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ఐసీసీ సమావేశం ముగిసిన వెంటనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ రాష్ట్ర సంఘాలకు రాసిన లేఖ ఆసక్తి రేకెత్తించింది. నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్‌2020ని పట్టాలెక్కించేందుకు బీసీసీఐ విస్తృత సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. 

భారత్‌లో నిర్వహించాల్సి వస్తే పిచ్‌లు, స్టేడియాలను సిద్ధంగా ఉంచేందుకు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలతో సమన్వయం సహా నిర్వహణ సాధ్యమైన షెడ్యూల్‌పై ఐపీఎల్‌ ప్రాంఛైజీలు, ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్‌ ఇండియాతో బీసీసీఐ సంప్రదింపులు చేసింది. ప్రస్తుత పరిస్థితుల బేరీజు, రాబోయే రోజుల్లో పరిస్థితిపై అంచనా ఆధారంగా సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 8 వరకు ఐపీఎల్‌ నిర్వహణకు మేలైన సమయంగా బీసీసీఐ భావిస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా, రద్దు లేదా రీ షెడ్యూల్‌ ఆధారంగా ఐపీఎల్‌ తాత్కాలిక షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

వేదికపై త్వరలో నిర్ణయం.... 

టీ20 వరల్డ్‌కప్‌ ఈ ఏడాది నిర్వహణ సాధ్యంకాదని భావిస్తోన్న బీసీసీఐ, ఐపీఎల్‌పై దూకుడుగా ముందుకెళ్తోంది. తాత్కాలిక షెడ్యూల్‌ సిద్ధం చేసినా, వేదికపై ఇంకా సందిగ్థత కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి భారత్‌లోనే ఐపీఎల్‌ నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. కానీ సెప్టెంబర్‌ సమయానికి భారత్‌లో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుతాయనే అంచనాలు ఉన్నాయి. 

దీంతో బీసీసీఐ వేదికపై ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ' ఐపీఎల్‌2020 ఖాళీ స్టేడియాల్లోనే జరుగుతుంది. అభిమానులకు ప్రవేశం లేదు కనుక, పరిమిత వేదికల్లోనే నిర్వహిస్తాం. విదేశాల్లో నిర్వహించేందుకు అవకాశం ఉంది. విదేశీ క్రికెటర్లు లేకుండా ఐపీఎల్‌ నిర్వహణ కొట్టిపారేయలేనిది' అని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్ ఆటను నేరుగా వీక్షించడానికి ఎలాగూ అభిమానులకు స్టేడియాల్లోకి ప్రవేశం లేనందున ఎక్కడ నిర్వహిస్తే ఏమిటనే భావన వ్యక్తమవుతుంది. ఎక్కడ ఆట నిర్వహించిన అందరూ చూసేది టీవీల్లోనే. దానితో వేదిక సంబంధం లేకుండా ఐపీఎల్ షెడ్యూల్ మీదనే దృష్టిపెట్టింది బీసీసీఐ. 

click me!