ఐపీఎల్ నే ప్రశ్నార్థకంగా మార్చిన చెన్నై, ఆనాడు బీసీసీఐ మాట విని ఉంటే...

By team teluguFirst Published Aug 29, 2020, 5:52 PM IST
Highlights

దుబాయ్ కి వెళ్లే ముందు బీసీసీఐ ఏ టీం కూడా ఇండియాలో ప్రాక్టీస్ క్యాంపులను నిర్వహించొద్దని చెప్పినప్పటికీ... చెన్నై జట్టు యాజమాన్యం మాత్రం టీం కి ఫుల్ ప్రాక్టీస్ అవసరమని భావించి చెన్నైలో ప్రాక్టీస్ క్యాంపు ను నిర్వహించారు. 

చెన్నై సూపర్ కింగ్స్ కి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రైనా ఈ సీజన్ కి అందుబాటులో ఉండడన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతుండగానే... స్టార్ బౌలర్ దీపక్ చాహర్ కరోనా బారినపడ్డ విషయం తెలిసింది. తదుపరి రుతురాజ్ గైక్వాడ్ కూడా కరోనా పడ్డాడన్న వార్తలు చెన్నై అభిమానుల్ని కలవర పెడుతున్నాయి. 

అధికారిక సమాచారం ప్రకారం కనీసం పదిమంది కరోనా వైరస్ బారినపడ్డట్టుగా తెలియవస్తుంది. ఇప్పటివరకు ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే ఈ పది మంది ఇన్ఫెక్షన్ బారినపడ్డవారిలో ఉన్నట్టుగా తెలియవస్తుంది. 

సురేష్ రైనా వెళ్లిపోవడం టీం కి చాలా పెద్ద ఎదురు దెబ్బ. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ విషయంలో రైనా టీం కి కొండంత అండ. టీం కష్టాల్లో ఉన్నప్రతిసారి.... ఈ సీనియర్ ప్లేయర్ తనదైన సహకారాన్ని అందించాడు. చెన్నై ఐపీఎల్ కప్పులు కొట్టడంలో రైనా పాత్ర కీలకం. 

ఇక చాహర్ విషయానికి వస్తే చెన్నై టీం లో కీ బౌలర్. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ధోనికి గో టు ప్లేయర్. పవర్ ప్లే నుంచి మొదలుకొని డెత్ బౌలింగ్ వరకు అన్నింటా చాహర్ చాలా సమర్థవంతంగా బౌలింగ్ చేయగలడు. 

ఇక రుతురాజ్ గైక్వాడ్ విషయానికి వస్తే.... సమర్థవంమతమైన టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్. ఈ 23 ఏండ్ల చిచ్చరపిడుగు డొమెస్టిక్ సర్క్యూట్ లో దుమ్ము రేగ్గొట్టాడు. ఇండియా ఏ, ఇండియా బి టీం తరుఫున కూడా మంచి ప్రదర్శన చేసాడు. 

ఇప్పుడు రైనా లేని వేళ, ఈ ఇద్దరు ప్లేయర్స్ కూడా టీం తో అంధులంబాటులో ఉండకుండా పోతారు. 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్ పీరియడ్ తరువాత మాత్రమే టీం తోపాటుగా పెక్ట్స్ కి అందుబాటులో ఉంటారు. ఈ ట్రైనింగ్ పీరియడ్ ని నష్టపోవడం టీం కి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. అసలే డెత్ బౌలింగ్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న టీం కి దీపక్ చాహర్ ట్రైనింగ్ కి అందుబాటులో ఉండకపోవడం ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. 

దుబాయ్ కి వెళ్లే ముందు బీసీసీఐ ఏ టీం కూడా ఇండియాలో ప్రాక్టీస్ క్యాంపులను నిర్వహించొద్దని చెప్పినప్పటికీ... చెన్నై జట్టు యాజమాన్యం మాత్రం టీం కి ఫుల్ ప్రాక్టీస్ అవసరమని భావించి చెన్నైలో ప్రాక్టీస్ క్యాంపు ను నిర్వహించారు. 

ధోని, రాయుడు వంటి సీనియర్ ప్లేయర్స్ క్రికెట్ ఆట కు దూరమయ్యే చాలా కాలమైనందున వారి కోసం ఈ ప్రాక్టీస్ అవసరమని టీం భావించింది. ఎయిర్ పోర్టుల్లోనయినా, లేదా వేరే ఎక్కడైనా ఒక్కసారి లక్షణాల్లేని వ్యక్తితో కాంటాక్ట్ లోకి వచ్చినా చాలు కరోనా వ్యాక్పిస్తుంది కదా అని చెన్నై టీం అంటుంది. 

సెప్టెంబర్ 19 నాటికి తొలి మ్యాచ్ ఆడదానికి తాము సిద్ధంగా ఉంటామని ఆశిస్తున్నట్టుగా చెన్నై భావిస్తుంది. చెన్నై జట్టు పరిస్థితులను చూసిన బీసీసీఐ షెడ్యూల్ ను హోల్డ్ లో ఉంచింది. ఆనాడే గనుక బీసీసీఐ మాట వినుంటే బాగుండేదని వినబడుతున్నమాట. 

click me!