ఐపీఎల్ లో కరోనా కలకలం: కంగారూలు కంగారు

By team teluguFirst Published Sep 2, 2020, 9:24 AM IST
Highlights

తాజాగా.... ఐపీఎల్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లో 13 పాజిటివ్‌ కేసులు నమోదు కావటంపై ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ కోసం అక్కడికి వెళ్లిన ఆస్ట్రేలియా.. సెప్టెంబర్‌ 17న యుఏఈకి చేరుకోనుంది. 

కరోనా దెబ్బకు పడకేసిన ఐపీఎల్, నిరవధికంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. పరిస్థితులు కొంతమేర అనుకూలించడంతో.... క్రికెట్ తిరిగి ప్రారంభమయింది. కరోనా ఇంకా కోరలు చాస్తూనే ఉన్నప్పటికీ.... బయో సెచురె బబుల్ వాతావరణంలో ఐపీఎల్ ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికే ప్రపంచ క్రికెట్ ఇదే బుడగ వాతావరణంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. 

తాజాగా.... ఐపీఎల్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లో 13 పాజిటివ్‌ కేసులు నమోదు కావటంపై ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ కోసం అక్కడికి వెళ్లిన ఆస్ట్రేలియా.. సెప్టెంబర్‌ 17న యుఏఈకి చేరుకోనుంది. 

చెన్నై సూపర్‌కింగ్స్‌లో 13 కరోనా కేసులు నమోదు కావటం ఆందోళనకు గురిచేసే అంశమేనని సీఎస్‌కే పేసర్‌ జోశ్‌ హెజిల్‌వుడ్‌ అన్నాడు. ' ఒకింత ఆందోళన ఉంది. కానీ ఐపీఎల్‌కు ఇంకా 20 రోజుల సమయం ఉండటం మంచి విషయం. యుఏఈకి వెళ్లే ముందు క్రికెట్‌ ఆస్ట్రేలియాతో మాట్లాడతాం. టోర్నీ ఆరంభానికి ముందు నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి మా ఫోకస్‌ పూర్తిగా ఇంగ్లాండ్‌ సిరీస్‌పైనే ఉంది' అని హెజిల్‌వుడ్‌ తెలిపాడు.

ఇకపోతే... వరుస షాకులతో ఉక్కిరిబిక్కిరవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఇప్పటికే సురేష్ రైనా దూరమవడం, దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్ కార్టోన  బారినపడడం,వీరితో పాటు కనీసం మరో 10 మంది సిబ్బంది కరోనా వైరస్ బారిన పడడంతో... టీంలో ఒకింత నిర్లిప్తత చోటు చేసుకుంది. 

క్రీడాకారులంతా ఇలా రూంలకే పరిమితమవడం, కరోనా బారినపడ్డ సహచరుల వల్ల భయాందోళలనలకు గురవుతున్న వేళ...  టీం అందరికి కరోనా పరీక్షలు నిర్వహించింది జట్టు. ఈ ఫలితాలు ఇప్పుడు టీంలో కోలాహలం నింపాయి

ఈ పరీక్షల్లో సిబ్బందితోసహా క్రీడాకారులందరికి కరోనా నెగటివ్ అని తేలింది. దీనితో సెప్టెంబర్ మూడవ తేదీన మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. ఆ పరీక్షల్లో కూడా అందరికి నెగటివ్ వస్తే... 5వ తేదీ నుండి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. 

రుతురాజ్, దీపక్ చాహర్ లు మాత్రం సెప్టెంబర్ 12వ తేదీ వరకు క్వారంటైన్ లోనే ఉండనున్నారు. వారి క్వారంటైన్ కాలం పూర్తయ్యాక మాత్రమే వారు జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటారు. 

లుంగీ ఎంగిడి, డూప్లెసిస్ దుబాయ్ చేరుకున్నారు. వారు నేరుగా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. 

click me!