గుడ్ న్యూస్: చెన్నై టీంలో అందరికీ కరోనా నెగటివ్

By team teluguFirst Published Sep 1, 2020, 5:30 PM IST
Highlights

క్రీడాకారులంతా ఇలా రూంలకే పరిమితమవడం, కరోనా బారినపడ్డ సహచరుల వల్ల భయాందోళలనలకు గురవుతున్న వేళ...  టీం అందరికి కరోనా పరీక్షలు నిర్వహించింది జట్టు. ఈ ఫలితాలు ఇప్పుడు టీంలో కోలాహలం నింపాయి

వరుస షాకులతో ఉక్కిరిబిక్కిరవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఇప్పటికే సురేష్ రైనా దూరమవడం, దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్ కార్టోన  బారినపడడం,వీరితో పాటు కనీసం మరో 10 మంది సిబ్బంది కరోనా వైరస్ బారిన పడడంతో... టీంలో ఒకింత నిర్లిప్తత చోటు చేసుకుంది. 

క్రీడాకారులంతా ఇలా రూంలకే పరిమితమవడం, కరోనా బారినపడ్డ సహచరుల వల్ల భయాందోళలనలకు గురవుతున్న వేళ...  టీం అందరికి కరోనా పరీక్షలు నిర్వహించింది జట్టు. ఈ ఫలితాలు ఇప్పుడు టీంలో కోలాహలం నింపాయి

ఈ పరీక్షల్లో సిబ్బందితోసహా క్రీడాకారులందరికి కరోనా నెగటివ్ అని తేలింది. దీనితో సెప్టెంబర్ మూడవ తేదీన మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. ఆ పరీక్షల్లో కూడా అందరికి నెగటివ్ వస్తే... 5వ తేదీ నుండి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. 

రుతురాజ్, దీపక్ చాహర్ లు మాత్రం సెప్టెంబర్ 12వ తేదీ వరకు క్వారంటైన్ లోనే ఉండనున్నారు. వారి క్వారంటైన్ కాలం పూర్తయ్యాక మాత్రమే వారు జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటారు. 

లుంగీ ఎంగిడి, డూప్లెసిస్ దుబాయ్ చేరుకున్నారు. వారు నేరుగా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. 

ఇకపోతే... చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రాంఛైజీలో 13 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో బీసీసీఐ అప్రమత్తమైంది. కోవిడ్‌19 బారిన పడిన 13 మందికి రోగ లక్షణాలు లేకపోవటం మరింత కలవరానికి గురి చేస్తోంది. 

సురక్షిత వాతావరణంలో ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ బృందం యుఏఈలో అహర్నిషలు కృషి చేస్తోంది. సూపర్‌ కింగ్స్‌ ఘటనతో ఇతర ప్రాంఛైజీలకు బోర్డు సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. క్వారంటైన్‌లో క్రికెటర్లను కచ్చితంగా హౌటల్‌ గదులకే పరిమితం చేసేలా సూచించింది. 

సూపర్‌ కింగ్స్‌ పాజిటివ్‌ కేసులతో, ఇతర ప్రాంఛైజీల క్రికెటర్లు సైతం ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 19న జరుగనున్న తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (తాత్కాలిక షెడ్యూల్‌ ప్రకారం) తలపడనున్న సంగతి తెలిసిందే!.

click me!