''ప్రొఫెషనల్ క్రికెటర్స్... ఈ యువకుడి అసాధారణ ప్రతిభను గమనించారా...?''

By Arun Kumar PFirst Published Jul 30, 2019, 5:34 PM IST
Highlights

భారత దేశంలో క్రికెట్ అనేది ఓ ప్రధాన క్రీడగా మారిపోయింది. అయితే ఇప్పటికీ చాలా మంది యువత అసాధారణ ప్రతిభను కలిగివున్నా గుర్తింపు దక్కగా గల్లీ క్రికెటర్లుగానే మిగిలిపోతున్నారు. ఇలాంటి వారిని వెలుగులోకి తేవడంలో ఐపిఎల్ ఎంతగానో ఉపయోగపడుతోంది. మరీ ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్  యాజమాన్యం యువకులకు ఎక్కువగా ప్రోత్సహిస్తూ వారికి మంచి  అవకాశాలిచ్చింది. 

ఐపిఎల్... భారత దేశంలోని ఎందరో యువకుల ప్రతిభను గుర్తించి వారిని వెలుగులోకి తెస్తోంది. ఈ లీగ్ లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా చాలామంది యువ క్రీడాకారులు భారత జట్టులో చోటు దక్కించుకోగలిగారు. అలా వాళ్లు అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లుగా ఎదగడంలో ఐపిఎల్ పాత్ర అతి ముఖ్యమైనది. ఇలా  యువకులను అత్యధికంగా ప్రోత్సహించడంలో అన్నింటికంటే ముందున్న జట్టు రాజస్థాన్ రాయల్స్. అయితే ఈ ప్రోత్సాహం కేవలం ఐపిఎల్ టోర్నీ జరిగే సమయంలోనే అనుకుంటే పొరబడినట్లే. తాము ఎప్పుడైనా....ఎక్కడైనా యువత ప్రతిభను గుర్తించడంలో ముందుంటామని రాజస్థాన్ యాజమాన్యం మరోసారి నిరూపించకుంది.

రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఓ యువకుడు ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో అసాధారణ రీతిలో ఫీల్డింగ్ చేశాడు. బ్యాట్స్ మెన్ బాదిన బంతి బౌండరీవైపు  దూసుకుపోతుంటే తన అసాధారణ ఫీల్డింగ్ దాన్ని అడ్డుకున్నాడు. కేవలం అడ్డుకోవడమే కాదు అత్యంత జాగ్రత్తగా గాల్లో ఎగురుతూనే బంతిని మరో ఫీల్డర్ కు అందించి బౌండరీ అవతల ల్యాండయ్యాడు. దీంతో బ్యాట్స్ మెన్ ఔటయ్యాడు. 

ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తేలీదు కానీ దానికి సంబంధించిన వీడియో రాజస్థాన్ రాయల్స్ వద్దకు చేరింది. దీంతో ఈ వీడియోను తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన  రాయల్స్ యాజమాన్యం '' ప్రొఫెషనల్ క్రికెటర్స్ దీన్ని గమనించారా..'' అన్న క్యాప్షన్ ను జతచేసింది. ఇలా రాయల్స్ పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లకు కూడా బాగా నచ్చినట్లుంది. ముఖ్యంగా ఆ యువకుడి పీల్డింగ్ క్రికెట్ ప్రియులకు తెగ నచ్చింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది. 

వీడియో

Professional cricketers - take note ✍ 👀 pic.twitter.com/4VM8Pd3CWX

— Rajasthan Royals (@rajasthanroyals)

 

click me!