IPL auction 2024: ఇంతకీ సమీర్ రిజ్వీ ఎవరు?

By Rajesh Karampoori  |  First Published Dec 20, 2023, 4:30 AM IST

IPL auction 2024: ఐపీఎల్ 2024 వేలంలో యూపీ జట్టుకు ఆడుతున్న 20 ఏళ్ల అన్‌క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ కోసం ప్రైస్ సీఎస్‌కే భారీ మొత్తాన్ని వెచ్చించింది. రూ.20 లక్షల బేస్ ప్రైస్ ఉన్న సమీర్ రిజ్వీని రూ.8.40 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. వేలం సమయంలో సమీర్ పేరును తీసుకున్న వెంటనే.. గుజరాత్ టైటాన్స్ ,ఢిల్లీ, CSK మధ్య బిడ్ వార్ జరిగింది. ఇంతకీ సమీర్ రిజ్వీ ప్రత్యేకత ఏంటీ?  


IPL auction 2024:దుబాయ్ లో ఏర్పాటు చేసిన ఐపీఎల్ ఆటగాళ్ల మినీ వేలంలో పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. అవడానికి ఇది మినీ వేలం అయినా, కొనుగోళ్ల పరంగా గత రికార్డులు బద్దలయ్యాయి. ఆయా ఫ్రాంచైజీలు తాము కోరుకున్న ఆటగాడిని దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీపడ్డాయి. ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ లకు రికార్డు స్థాయి ధర పలికిందంటే ఫ్రాంచైజీల మధ్య పోటీనే కారణం.

ఐపిఎల్ 2024 వేలంలో యుపి జట్టుకు ఆడుతున్న 20 ఏళ్ల అన్‌క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ కోసం సిఎస్‌కె భారీ మొత్తాన్ని వెచ్చించింది. రూ.20 లక్షల బేస్ ప్రైస్ ఉన్న సమీర్ రిజ్వీని రూ.8.40 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. వేలం సమయంలో సమీర్ పేరును తీసుకున్న వెంటనే, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు CSK మధ్య మొదట భీకర పోరు కనిపించింది. 

Latest Videos


గుజరాత్ టైటాన్స్‌ను చూసిన ఢిల్లీ క్యాపిటల్స్ సమీర్‌ను కొనుగోలు చేయకుండా దూరం చేసుకుంది. ఐపీఎల్ 2024 వేలం బిడ్డింగ్ వార్ గుజరాత్ , CSK మధ్య కనిపించింది. చివరికి సమీర్ రిజ్వీని రూ.8.40 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. UP T-20 లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు రిజ్వీకి రివార్డ్ లభించింది. ఈ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

నిజానికి.. సమీర్ రిజ్వీ 2003 సంవత్సరంలో జన్మించాడు. అతను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నివాసి.20 ఏళ్ల సమీర్ రిజ్వీ యూపీ టీ20 లీగ్‌లో కాన్పూర్ సూపర్ స్టార్స్ తరఫున అత్యధిక పరుగులు చేశాడు. టోర్నీలో సమీర్ 2 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ సాధించాడు. టోర్నీలో సమీర్ బ్యాట్‌తో ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతను మైదానంలో అలావొకగా చాలా సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత అతనిపై సర్వత్రా చర్చ జరిగింది. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, ఆఫ్ స్పిన్నర్ సమీర్‌ను  సురేష్ రైనా స్థానాన్ని భర్తీ చేయాలని ఉద్దేశంతో ఇతడిని తీసుకున్నారు.  

అంతేకాదు. ఇతడు యూపీ టీ20 లీగ్‌లో కాన్పూర్ సూపర్ స్టార్ ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. గోరఖ్‌పూర్ లయన్స్‌పై 49 బంతుల్లో 104 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టోర్నీలో సమీర్ 9 ఇన్నింగ్స్‌ల్లో 455 పరుగులు చేశాడు. ఇది కాకుండా.. పురుషుల అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తరప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ట్రోఫీని గెలుచుకోవడంలో రిజ్వీ ముఖ్యమైన పాత్ర పోషించాడు. IPL 2024లో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా సమీర్ రిజ్వీ నిలిచాడు. 

click me!