IPL Auction 2020: అన్నకు ఇర్ఫాన్ పఠాన్ ఓదార్పు

Published : Dec 20, 2019, 12:48 PM IST
IPL Auction 2020: అన్నకు ఇర్ఫాన్ పఠాన్ ఓదార్పు

సారాంశం

ఐపిఎల్ యాక్షన్ లో చేదు అనుభవాన్ని ఎదుర్కున్న యూసుఫ్ పఠాన్ కు తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ రెండు ఓదార్పు మాటలు చెప్పాడు. ఐపిఎల్ వేలంలో యూసుఫ్ పఠాన్ ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాని విషయం తెలిసిందే.

కోల్ కతా: ఐపిఎల్ వేలంలో ఫ్రాంచైజీల నిరాదరణకు గురైన యూసుఫ్ పఠాన్ ను తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఆయనకు ఓదార్పు మాటలు చెప్పాడు. బుధవారం కోల్ కతాలో జరిగిన ఐపిఎల్ వేలంలో యూసుఫ్ పఠాన్ అమ్ముడుపోని విషయం తెలిసిందే. 

యూసుఫ్ పఠాన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం రిలీజ్ చేసింది. అతని బేస్ ప్రైస్ కోటి రూపాయలు. అయితే, అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దీంతో అన్నకు ఇర్ఫాన్ పఠాన్ ఊరడింపు సందేశం ఇచ్చాడు. 

Also Read: IPL Auction: విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం

చిన్న ఆటంకాలు నీ కేరీర్ ను నిర్ణయించవు. నువ్వు అద్భుతంగానే ఆడుతూ వస్తున్నావు. నువ్వు రియల్ మ్యాచ్ విన్నర్ వి. లవ్ యూ ఆల్వేస్ లాలా అంటూ ఇర్ఫాన్ పఠాన్ యూసుఫ్ పఠాన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు.

యూసుఫ్ పఠాన్ 2019 సీజన్ లో పది మ్యాచులు ఆదడి 40 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 13.33 మాత్రమే ఉంది. అతని అత్యధిక స్కోరు 16 పరుగులు. సీజన్ మొత్తంలో ఆరు బంతులు మాత్రమే వేశాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

Also Read: IPL Auction 2020: పానీపూరీ అమ్మేవాడు, కోటీశ్వరుడయ్యాడు

2018లో కూడా యూసుఫ్ పఠాన్ ప్రదర్శన ఏమంత బాగా లేదు. అతను 15 మ్యాచులు ఆడాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నరప్స్ గా నిలిచింది. ఈ సీజన్ లో 260 పరుగులు చేశాడు. ఒక్క అర్త సెంచరీ కూడా చేయలేకపోయాడు. 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?