ఐపీఎల్: పాపం పంత్

Bhavana Thota   | ANI
Published : May 05, 2025, 04:24 PM ISTUpdated : May 05, 2025, 04:27 PM IST
ఐపీఎల్: పాపం పంత్

సారాంశం

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. అయితే, రిషబ్ పంత్ కష్టాల్లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్ మధ్య సత్సంబంధాలు అతని విజయానికి కారణమని అంబటి రాయుడు అన్నారు.పంత్ వికెట్ కీపర్, కెప్టెన్ గా రెండు  బాధ్యతలను నిర్వహించడం వల్ల ఒత్తిడికి గురవుతున్నాడు.

న్యూ ఢిల్లీ : ఈ  ఏడాది  ఐపీఎల్ వేలంలో అత్యధికంగా రూ.25 కోట్లకు పైగా పలికిన  శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా అత్యుత్తమ ప్రతిభను చూపిస్తున్నాడు. అతని ప్రదర్శనతో పాటు కెప్టెన్సీకి కూడా అటు క్రికెట్ అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉండడంతో పాటు ప్లేఆఫ్‌లకు  కూడా బలమైన పోటీదారుగా నిలిచింది.రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కొనుగోలు చేసిన రిషబ్ పంత్ కి మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ చాలా కఠినంగా ఉన్నట్లే తెలుస్తోంది.శ్రేయస్ అయ్యర్, కోచ్ రికీ పాంటింగ్ మధ్య సత్సంబంధాలు అతని విజయానికి కీలక పాత్ర పోషిస్తున్నాయని మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు."శ్రేయస్ కి ఢిల్లీ (క్యాపిటల్స్) లో రికీ పాంటింగ్ తో మంచి అనుబంధం ఉంది," అని  రాయుడు అన్నాడు.
"వారిద్దరూ ఒకరినొకరు బాగా తెలుసు. అది చాలా ముఖ్యం. కెప్టెన్ గా మీరు మీ కోచ్ ని తెలుసుకోవాలి ఎందుకంటే ఇద్దరూ కలిసి పనిచేయాలి. ఇది సుదీర్ఘ టోర్నమెంట్. మీరు వేర్వేరు ఆలోచనలతో ఉండలేరు. శ్రేయస్ కి రికీ పాంటింగ్  అంటే  చాలా ఇష్టం. అతను వ్యూహాల పరంగా కాస్త దూకుడుగా ఉండే వ్యక్తి, ప్రస్తుతం పంజాబ్ లో ఇది మంచి జోడీ అని నేను అనుకుంటున్నాను. బ్యాట్స్‌మెన్‌గా శ్రేయస్ కచ్చితంగా చాలా మెరుగుపడ్డాడు," అని ఆయన అభిప్రాయపడ్డాడు.అయితే, పంత్ వికెట్ కీపర్, కెప్టెన్ గా రెండు  బాధ్యతలను నిర్వహించడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారని మాజీ న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ కేటీ మార్టిన్ కూడా అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.

ఒత్తిడిలో పంత్

గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగమైనప్పుడు పంత్ కంటే శ్రేయస్ అయ్యర్ పాంటింగ్ కోచింగ్ శైలికి బాగా సరిపోతాడని ఆమె గుర్తించినట్లు తెలిపింది."పాంటింగ్ వేలంలోకి వెళ్లి, కెప్టెన్ చుట్టూ జట్టును నిర్మించాలని, కెప్టెన్ జట్టుకు నాయకత్వం వహించాలని అతను చాలా మాట్లాడినట్లు మార్టిన్ చెప్పింది."శ్రేయస్ అయ్యర్ కూడా పరుగులు చేయడంతో, అతను దానిని కెప్టెన్సీగా,ఆత్మవిశ్వాసంగా మార్చుకోగలిగాడు. ఆత్మవిశ్వాసం లేని పంత్ తాను అనుకున్నానన్ని పరుగులు కూడా చేయలేకపోతున్నట్లు  ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.వికెట్ కీపర్‌ గా కూడా  పంత్ చాలా ఒత్తిడికి గురవుతున్నట్లు భావిస్తున్నట్లు ఆమె అన్నారు. "మీరు కీపింగ్ చేస్తున్న సమయంలో ఆటలో ఇతర ఆటగాళ్ల మీద ఆధారపడాల్సి ఉంటుందని  ఆమె అన్నారు. ఎవరైనా  ఆటగాడు బౌండరీలో ఎక్కువ సేపు నిలిచి ఉంటే మాత్రం అది పంత్ కి పెద్ద సవాల్ గా ఉంటుందని  ఆమె అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !
ODI Records : ముగ్గురు మొనగాళ్లు.. వన్డే క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కింగ్‌లు ఎవరో తెలుసా?